ఏప్రిల్ 21తో మొదలయ్యే వారపు పట్టిక
ఏప్రిల్ 21తో మొదలయ్యే వారం
పాట 19, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
cl 29వ అధ్యా., 11-15 పేరాలు (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: నిర్గమకాండము 15-18 (10 నిమి.)
నం. 1: నిర్గమకాండము 15:20–16:5 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: సృష్టి—నిరూపిత విజ్ఞానశాస్త్రంతో ఏకీభవిస్తుంది; పరిణామ సిద్ధాంతంతో విభేదిస్తుంది—td 43ఎ (5 నిమి.)
నం. 3: గర్భస్రావం—జీవం దేవుడిచ్చిన అమూల్యమైన బహుమానం (5 నిమి.)
సేవా కూటం:
15 నిమి: ప్రయాసపడుతున్న వాళ్లు. (1 థెస్స. 5:12, 13) ఇద్దరు పెద్దల్ని ఇంటర్వ్యూ చేయండి. వాళ్లు సంఘంలో, సంస్థలో ఎలాంటి నియామకాల్ని నిర్వర్తిస్తున్నారు? వేరే బాధ్యతలున్నా, ఆ నియామకాలను ఎలా చూసుకోగలుగుతున్నారు? పరిచర్యకు ప్రాధాన్యత ఇవ్వడానికి వాళ్లు ఏమి చేస్తున్నారు? తమ కుటుంబ సభ్యులు వాళ్లకు ఎలా మద్దతిస్తున్నారు?
15 నిమి: రానున్న విద్యా సంవత్సరం కోసం సిద్ధపడండి. ప్రేక్షకులతో చర్చ. యౌవన క్రైస్తవులకు స్కూల్లో ఎలాంటి సవాళ్లు ఎదురౌతాయో టూకీగా చెప్పమని ప్రేక్షకులను అడగండి. కుటుంబ ఆరాధన సమయంలో ఇండెక్స్‌ను (ఇంగ్లీషు), యువత అడిగే ప్రశ్నలు (ఇంగ్లీషు) పుస్తకాలను, సంస్థ రూపొందించిన ఇతర ప్రచురణలను ఉపయోగించి శోధనలను ఎదిరించడానికి, తమ విశ్వాసం గురించి ఇతరులతో మాట్లాడడానికి తల్లిదండ్రులు పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చో వివరించండి. (1 పేతు. 3:15, 16) ఒకట్రెండు అంశాలను తీసుకొని, వాటికి సంబంధించి మన ప్రచురణల్లో వచ్చిన ఉపయోగకరమైన సమాచారం గురించి చెప్పండి. పాఠశాలలో ఉన్నప్పుడు తాము ఎలా సాక్ష్యమివ్వగలిగారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 51, ప్రార్థన