పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చు కుందాం—ఆసక్తి చూపించినవాళ్ల వివరాలు రాసిపెట్టుకోండి
“నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము.” (1 తిమో. 4:16) అపొస్తలుడైన పౌలు తిమోతికి ఇచ్చిన ఆ ప్రేరేపిత సలహా, కొత్త వాళ్లమైనా అనుభవమున్న వాళ్లమైనా మనమందరం ప్రగతి సాధించడానికి కృషిచేయాలని చూపిస్తుంది. దానికోసం ఇప్పటినుండి, “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం” అనే శీర్షికతో మన రాజ్య పరిచర్యలో కొన్ని ఆర్టికల్స్ వస్తాయి. ప్రతీ ఆర్టికల్, ముఖ్యమైన ఒక నైపుణ్యం గురించి చర్చిస్తుంది. ఆ నైపుణ్యాన్ని వృద్ధిచేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని సూచనలు కూడా దానిలో ఉంటాయి. ఆ నెలంతా ఆ నైపుణ్యం మీదే దృష్టి పెట్టమని అందర్నీ ప్రోత్సహిస్తున్నాం. దానివల్ల పొందిన ప్రయోజనాల గురించి చెప్పడానికి ఆ నెల చివర్లో జరిగే సేవాకూటంలో ఒక భాగం ఉంటుంది. ఈ నెల, ‘ఆసక్తి చూపించినవాళ్ల వివరాలు రాసిపెట్టుకోవడం’ అనేదాని మీద దృష్టిపెడతాం.
ఎందుకు ప్రాముఖ్యం? మన పనిని సరిగ్గా నిర్వర్తించాలంటే, ఊరికే ప్రకటిస్తే సరిపోదు. నాటిన సత్య విత్తనాలకు నీళ్లు కూడా పోయాలి, అంటే ఆసక్తిపరులను మళ్లీ కలిసి వాళ్లకు బోధించాలి. (మత్త. 28:19, 20; 1 కొరిం. 3:6-9) దానికి వాళ్లను మళ్లీ కలవాలి, వాళ్ల యోగక్షేమాలు తెలుసుకోవాలి, అంతకుముందు వాళ్లతో మాట్లాడిన దాని ఆధారంగా సంభాషణ కొనసాగించాలి. కాబట్టి, ఎవరైనా ఆసక్తి చూపిస్తే తప్పకుండా వాళ్ల వివరాలు రాసిపెట్టుకోవాలి.
ఈ నెలలో దీన్ని ప్రయత్నించండి:
మీరు వివరాలు రాసుకుంటున్నప్పుడు, మీరు ఏమి రాసుకుంటున్నారో మీతో కలిసి పనిచేస్తున్న వాళ్లతో చెప్పండి.