డిసెంబరు 30తో మొదలయ్యే వారపు పట్టిక
డిసెంబరు 30తో మొదలయ్యే వారం
పాట 50, ప్రార్థన
□ సంఘ బైబిలు అధ్యయనం:
cl 23వ అధ్యా., 19-23 పేరాలు, 239వ పేజీలోని బాక్సు (30 నిమి.)
□ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ప్రకటన 15-22 (10 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
□ సేవా కూటం:
15 నిమి: “‘విశ్వాసమందు స్థిరపడేందుకు’ వాళ్లకు సహాయం చేయండి.” ప్రసంగం. తర్వాత పత్రిక ఉపయోగించి, జనవరి నెల మొదటి శనివారం బైబిలు అధ్యయనం ఎలా మొదలుపెట్టవచ్చో చిన్న ప్రదర్శన చేయించండి. బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి కృషిచేయమని అందర్నీ ప్రోత్సహించండి.
15 నిమి: ప్రచారకులయ్యేలా మీ పిల్లలకు సహాయం చేయండి. సంస్థీకరించబడ్డాం పుస్తకం, 82వ పేజీలోని 1-2 పేరాల ఆధారంగా ప్రసంగం. బాప్తిస్మం పొందని ప్రచారకుడైన పిల్లవాడున్న మాదిరికరమైన తల్లిని/తండ్రిని ఇంటర్వ్యూ చేయండి. తమ పిల్లవాడు ప్రచారకుడయ్యేలా అభివృద్ధి సాధించడానికి ఎలా సహాయపడ్డారో చెప్పమనండి.
పాట 20, ప్రార్థన