దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2013 డిసెంబరు 30తో మొదలయ్యే వారంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం. ప్రతీ ప్రశ్న చివర్లో, దాన్ని చర్చించబోయే తేదీ ఉంది. మీరు ప్రతీవారం పాఠశాలకు సిద్ధపడేటప్పుడు దాని గురించి కూడా పరిశోధన చేయవచ్చు.
1. లౌకిక అధికారులతో వ్యవహరించేటప్పుడు సాత్వికమును చూపించడానికి ఏది సహాయం చేస్తుంది? (తీతు 3:2) [నవం. 4, w03 4/1 25వ పేజీ, 18-19 పేరాలు]
2. ఫిలేమోను 4-7 వచనాల్లో పౌలు ఫిలేమోనుతో అన్న మాటల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? [నవం. 4, w08 10/15 31వ పేజీ, 2-3 పేరాలు]
3. మనం దేవుని విశ్రాంతిలోకి ఎలా ప్రవేశించవచ్చు? (హెబ్రీ. 4:9-11) [నవం. 11, w11 7/15 28వ పేజీ, 16-17 పేరాలు]
4. “నీతికార్యములను” జరిగించిన సమూయేలు, నమ్మకమైన న్యాయాధిపతులు, ప్రవక్తల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (హెబ్రీ. 11:32, 33) [నవం. 18, w11 7/1 17వ పేజీ, 5-6 పేరాలు]
5. “పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది” అని యాకోబు ఎందుకు రాశాడు? (యాకో. 3:17) [నవం. 25, w11 8/15 30వ పేజీ, 15వ పేరా]
6. ‘సువార్త ప్రకటించబడిన మృతులు’ ఎవరు? (1 పేతు. 4:6) [డిసెం. 02, w08 11/15 21వ పేజీ, 7వ పేరా]
7. మొదటి యోహాను 2:7, 8లో ఏ ఆజ్ఞను “పూర్వపు” ఆజ్ఞ అని, “క్రొత్త” ఆజ్ఞ అని యోహాను పేర్కొన్నాడు? [డిసెం. 9, w08 12/15 27వ పేజీ, 5వ పేరా]
8. “అల్ఫాయు ఓమెగయు,” “మొదటివాడను కడపటివాడను” అనే బిరుదులు ఎవరికి వర్తిస్తాయి? (ప్రక. 1:8, 18) [డిసెం. 16, w09 1/15 30వ పేజీ, 6వ పేరా]
9. అభిషిక్త క్రైస్తవులు ఏ రెండు విధాల్లో ‘ముద్రించబడతారు’? (ప్రక. 7:3) [డిసెం. 23, w07 1/1 31వ పేజీ, 2వ పేరా]
10. లేఖనంలో ముందే చెప్పిన దీవెనలు తప్పక వస్తాయని మనం ఎందుకు ఎదురుచూడవచ్చు? అది తెలుసుకోవడం మనమీద ఎలాంటి ప్రభావం చూపించాలి? (ప్రక. 21:5, 6) [డిసెం. 30, re 303వ పేజీ, 9వ పేరా]