అక్టోబరు 28తో మొదలయ్యే వారపు పట్టిక
అక్టోబరు 28తో మొదలయ్యే వారం
పాట 25, ప్రార్థన
□ సంఘ బైబిలు అధ్యయనం:
cl 20వ అధ్యా., 13-21 పేరాలు, 207వ పేజీలోని బాక్సు (30 నిమి.)
□ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 తిమోతి 1–2 తిమోతి 4 (10 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
□ సేవా కూటం:
15 నిమి: సువార్తకున్న ఆచరణాత్మక విలువను నొక్కిచెప్పండి. పరిచర్య పాఠశాల పుస్తకం, 159వ పేజీలోని సమాచారం ఆధారంగా చర్చ. స్థానిక ప్రజలకు ఆసక్తిగా ఉండే ఒక అంశం గురించి మాట్లాడి బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఎలా పరిచయం చేయవచ్చో ప్రదర్శనలో చూపించండి.
15 నిమి: సమయపాలన ఎందుకు ప్రాముఖ్యం? చర్చ. (1) యెహోవా సమయాన్ని చక్కగా పాటిస్తాడని మనం ఎలా చెప్పవచ్చు? (హబ. 2:3) (2) కూటాలకు, పరిచర్యకు సమయానికి వెళ్లడం మనకు యెహోవా పట్ల గౌరవం, ఇతరుల పట్ల శ్రద్ధ ఉన్నాయని ఎలా చూపిస్తుంది? (3) మనం క్షేత్రసేవా కూటానికి ఆలస్యంగా వెళ్లడం వల్ల గుంపుకు, క్షేత్రసేవా కూటాన్ని నిర్వహించే సహోదరునికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావచ్చు? (4) ఆసక్తి చూపించిన వ్యక్తితో గానీ, బైబిలు విద్యార్థితో గానీ ఫలానా సమయానికి వస్తామని చెప్పినప్పుడు, మనం ఖచ్చితంగా చెప్పిన సమయానికే వెళ్లడం ఎందుకు ప్రాముఖ్యం? (మత్త. 5:37) (5) పరిచర్యకు సంబంధించిన విషయాల్లో, సంఘ కూటాలకు హాజరయ్యే విషయంలో సమయాన్ని పాటించడానికి ఉపయోగపడే కొన్ని సలహాలు చెప్పండి.
పాట 11, ప్రార్థన