మీతో కలిసి పరిచర్య చేయడానికి ఇతరులను ఆహ్వానించగలరా?
తీవ్రమైన ఆరోగ్య సమస్యల వల్ల లేదా వృద్ధాప్యం వల్ల పరిచర్యను అంతగా చేయలేకపోతున్న ప్రచారకులు చాలా సంఘాల్లో ఉన్నారు. (2 కొరిం. 4:16) మీతో కలిసి బైబిలు అధ్యయనానికి రమ్మని అలాంటి వాళ్లను ఆహ్వానించగలరా? ఒకవేళ వాళ్లు, ఇల్లు దాటి బయటకు రాలేని స్థితిలో ఉంటే, వాళ్లింట్లోనే బైబిలు అధ్యయనం నిర్వహించవచ్చు. ఆరోగ్యం అంతగా సహకరించని వాళ్లను అప్పుడప్పుడు మీతోపాటు ఇంటింటి పరిచర్యకు తీసుకెళ్లి కొన్ని ఇళ్లు మాట్లాడేందుకు లేదా ఒకట్రెండు పునర్దర్శనాలకు తీసుకెళ్లేందుకు మీరు ఏర్పాట్లు చేసుకోగలరా? అలాచేస్తే వాళ్లు ఎంతో ప్రోత్సాహం పొందుతారు, వాళ్ల అనుభవం నుండి మీరూ ప్రయోజనం పొందుతారు. (రోమా. 1:11, 12) అంతేకాదు, ఇలా మీ ప్రేమను చూపించడానికి మీరు చేసే ప్రయత్నాలను బట్టి యెహోవా మిమ్మల్ని తప్పక దీవిస్తాడు.—సామె. 19:17; 1 యోహా. 3:17, 18.