జూలై 15తో మొదలయ్యే వారపు పట్టిక
జూలై 15తో మొదలయ్యే వారం
పాట 5, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 15వ అధ్యా., 8-17 పేరాలు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: అపొస్తలుల కార్యములు 18-21 (10 నిమి.)
నం. 1: అపొస్తలుల కార్యములు 20:17-38 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: అపొస్తలులు ధైర్యంగా ప్రకటించారు—bm 25వ పేజీ (5 నిమి.)
నం. 3: “ఆత్మానుసారమైన మనస్సు” కలిగివున్నామని మనం ఎలా చూపించవచ్చు?—రోమా. 8:6(5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: సువార్త ప్రకటించే పద్ధతులు—ఆసక్తిగలవారిని యెహోవా సంస్థవైపుకు నడిపించడం. సంస్థీకరించబడ్డాం పుస్తకం, 99వ పేజీలోని 2వ పేరా నుండి 100వ పేజీలోని 1వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా ప్రసంగం. విద్యార్థులను సంస్థ వైపుకు నడిపించడానికి యెహోవా ఇష్టం బ్రోషుర్‌ను ఎలా ఉపయోగించారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
10 నిమి: యెహోవాను పరీక్షించి, పట్టజాలనంత విస్తారంగా దీవెనలు పొందండి (మలా. 3:10) ఇద్దరు లేదా ముగ్గురు క్రమ పయినీర్లను ఇంటర్వ్యూ చేయండి. పయినీరు సేవకు సంబంధించిన ఏ విషయాన్ని వాళ్లు ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు? యెహోవాకు దగ్గరవ్వడానికి వాళ్లకు పయినీరు సేవ ఎలా సహాయం చేసింది? వాళ్లకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు చెప్పమనండి. సెప్టెంబరు నెల నుండి క్రమ పయినీరు సేవ చేయడం వీలవుతుందేమో ఆలోచించమని ప్రచారకులను ప్రోత్సహించి, ముగించండి.
10 నిమి: “ప్రవక్తల్ని ఆదర్శంగా తీసుకోండి— యోవేలు?” ప్రశ్నాజవాబులు.
పాట 54, ప్రార్థన