కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/13 పేజీలు 2-3
  • దేవుణ్ణి మహిమపర్చే ప్రవర్తన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుణ్ణి మహిమపర్చే ప్రవర్తన
  • మన రాజ్య పరిచర్య—2013
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉండండి’
    మన రాజ్య పరిచర్య—2014
  • సమావేశ జ్ఞాపికలు
    మన రాజ్య పరిచర్య—2015
  • మన జిల్లా సమావేశాలు—సత్యం గురించి శక్తివంతంగా సాక్ష్యమిస్తాయి
    మన రాజ్య పరిచర్య—2012
  • మూడు రోజుల ఆధ్యాత్మిక విందు
    మన రాజ్య పరిచర్య—2011
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2013
km 7/13 పేజీలు 2-3

దేవుణ్ణి మహిమపర్చే ప్రవర్తన

1. యెహోవాసాక్షులు జిల్లా సమావేశానికి వచ్చారని అందరికీ ఎలా తెలిసిపోతుంది?

1 జిల్లా సమావేశాలకు హాజరౌతున్నప్పుడు, చూసేవాళ్లకు మనం ప్రత్యేకంగా కనిపిస్తాం. సమావేశాలు జరిగే చాలా నగరాల్లోని స్థానిక వార్తా మాధ్యమాలు, మనం అక్కడకు చేరుకున్నామని ప్రజలకు తెలియజేస్తాయి. సమావేశానికి వచ్చినవాళ్లతో లాడ్జీలు, హోటళ్లు నిండిపోతాయి, వాళ్లలో చాలామంది సమావేశ బ్యాడ్జిలు ధరించివుండడం ఆ ప్రాంతంలోని ప్రజలు గమనిస్తారు. కాబట్టి, సమావేశ నగరంలో ఉన్నప్పుడు మన మంచి ప్రవర్తనతో దేవునికి ఎలా మహిమ తీసుకురావచ్చో గుర్తుచేసే కొన్ని విషయాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.—1 పేతు. 2:12.

2. సమావేశ నగరంలో ఉన్నప్పుడు మన చక్కని వస్త్రధారణ దేవుణ్ణి ఎలా మహిమపరుస్తుంది?

2 చక్కని వస్త్రధారణ: సమావేశానికి హాజరైనప్పుడు మనం పద్ధతిగా తయారవడం చూసి చాలామంది ముగ్ధులౌతారు. అయితే, లాడ్జీలో దిగేటప్పుడు, భోజనానికి హోటల్‌కు వెళ్లినప్పుడు, షాపింగ్‌ చేసేటప్పుడు ఇలా ఇతర సమయాల్లో మనం వేసుకునే బట్టలు చూసి ప్రజలు మన గురించి ఓ అభిప్రాయానికి వచ్చేస్తారు. అలాగని ఇలాంటి సందర్భాల్లో మరీ కూటానికి వెళ్లినట్లు తయారవ్వమని కాదుగానీ, ఇంట్లో వేసుకునేలాంటివి కాకుండా చక్కగా, మర్యాదగా ఉండే బట్టలు వేసుకోవాలి. సత్యంలో లేని వాళ్లకు, మనకు మధ్య తేడా అందరికీ స్పష్టంగా కనిపించాలి. (రోమా. 12:2) మనం సమావేశ బ్యాడ్జి కూడా పెట్టుకోవాలి. దానివల్ల సమావేశం గురించి అందరికీ తెలుస్తుంది, మనకు సాక్ష్యమిచ్చే అవకాశం దొరుకుతుంది, సమావేశానికి హాజరైన ఇతరులు మనల్ని గుర్తిస్తారు.

3. మనం ఎలా సహనం, మర్యాద చూపించవచ్చు?

3 సహనం, మర్యాద: స్వార్థపరులు, కృతజ్ఞతలేనివారే ఎక్కువగా ఈ లోకంలో మనం సహనం, మర్యాద చూపించినప్పుడు లాడ్జీలు, రెస్టారెంట్లు వంటి చోట పనిచేసే వాళ్లకు ఎంతో సేదదీర్పుగా ఉంటుంది! (2 తిమో. 3:1-5) సమావేశ హాల్లో సీట్లు ఆపుతున్నప్పుడు లేదా కొత్తగా విడుదలైన సాహిత్యాలను తీసుకోవడానికి లైన్లో నిల్చున్నప్పుడు, మనం మన గురించి మాత్రమే కాదుగాని, ఎదుటివాళ్ల గురించి కూడా ఆలోచించాలి. (1 కొరిం. 10:23, 24) మొట్టమొదటిసారిగా సమావేశానికి హాజరైన తర్వాత ఓ ఆసక్తిపరుడు ఇలా అన్నాడు: “ఆ రోజు విన్న ప్రసంగాల్లో ఒక్కటి కూడా నాకు గుర్తులేదు గాని సాక్షుల ప్రవర్తన మాత్రం నాపై చెరగని ముద్ర వేసింది.”

4. మన పరిస్థితులు అనుకూలిస్తే సమావేశాల్లో స్వచ్ఛంద సేవ చేయడం గురించి ఎందుకు ఆలోచించాలి?

4 స్వచ్చంధ సేవ: స్వచ్ఛంద సేవ చేసే విషయంలో నిజక్రైస్తవులు పేరుగాంచారు. (కీర్త. 110:3) మీరు కూడా సమావేశాల్లో స్వచ్ఛందగా సేవచేయగలరా? ఒక సమావేశ స్థలాన్ని శుభ్రం చేయడానికి దాదాపు 600 మంది సహోదరసహోదరీలు స్వచ్ఛంద సేవ చేశారు. దానిని చూసిన అక్కడి ఉద్యోగులు ఇలా అన్నారు: “ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు. వీళ్లందరూ స్వచ్ఛంద సేవకులంటే నమ్మడం చాలా కష్టంగా ఉంది.” మనం 2013 జిల్లా సమావేశాల కోసం; దేవుని గురించి విని, నేర్చుకోవడంతోపాటు ఆయనను మహిమపర్చే అవకాశం కోసం ఎంతో ఆతురతో ఎదురుచూస్తున్నాం.

[2వ పేజీలోని చిత్రం]

2013 జిల్లా సమావేశ జ్ఞాపికలు

▪ కార్యక్రమ వేళలు: సమావేశపు హాలు తలుపులు ఉదయం 8:00 గంటలకు తెరుస్తారు. మూడు రోజులూ, ప్రారంభ సంగీతం ఉదయం 9:20కి మొదలవుతుంది. కార్యక్రమం క్రమపద్ధతిలో, గౌరవప్రదంగా ఆరంభమవ్వాలంటే ఆ సమయానికల్లా మనందరం సీట్లలో కూర్చోవాలి. ముగింపు పాట, ప్రార్థనతో కార్యక్రమం శుక్రవారం, శనివారం రోజుల్లో సాయంత్రం 4:50కు, ఆదివారం రోజున 3:35కి ముగుస్తుంది.

▪ పార్కింగ్‌: సమావేశ స్థలాల్లో అందరూ తమ వాహనాలను ఉచితంగా పార్క్‌ చేసుకోవచ్చు. స్థలం అందుబాటులో ఉన్నంతవరకు, హాజరైనవాళ్లంతా తమ వాహనాలను పార్క్‌చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, సాధారణంగా పార్కింగ్‌ స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి, ఒక కారులో కేవలం ఒకరిద్దరే కాకుండా వీలైనంతవరకు ఎక్కువ మంది కూర్చొని రావడానికి ప్రయత్నించాలి. తగిన లైసెన్స్‌ ప్లేట్‌ లేదా ప్లకార్డ్‌ ఉన్నవాళ్లు మాత్రమే వికలాంగుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలో తమ వాహనాలను పార్క్‌ చేసుకోవచ్చు.

▪ సీట్లు పెట్టుకోవడం: మన ఇంట్లో వాళ్లకు, మనతోపాటు ఒకే కారులో వచ్చినవాళ్లకు, లేదా ప్రస్తుతం మనం బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్న వాళ్లకు మాత్రమే సీట్లు పెట్టుకోవచ్చు. వృద్ధులకు, అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్లకు కేటాయించే సీట్లు కొన్నే ఉంటాయి కాబట్టి వాళ్ల కుటుంబ సభ్యులందరూ వాళ్లతో పాటు కూర్చోవడం కుదరకపోవచ్చు. అందుకే ఆ సీట్లను వృద్ధులకు, అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్లకు, వాళ్లకు సహాయపడేవాళ్లకు వదిలేయండి.—1 కొరిం. 13:5.

▪ మధ్యాహ్న భోజనం: మధ్యాహ్న భోజనం కోసం హాలు ప్రాంగణం వదిలి బయటకు వెళ్లే బదులు, తేలికపాటి ఆహారాన్ని దయచేసి మీ వెంట తెచ్చుకోండి. కుర్చీ కింద పెట్టుకోగలిగే చిన్న డబ్బాలో ఆహారం తెచ్చుకుంటే సరిపోతుంది. కుటుంబం మొత్తానికి సరిపోయే పెద్దపెద్ద డబ్బాలు, గాజు వస్తువులు తీసుకురాకూడదు.

▪ విరాళాలు: సమావేశంలో ప్రపంచవ్యాప్త పని కోసం స్వచ్ఛంద విరాళాలు ఇవ్వడం ద్వారా సమావేశ ఏర్పాట్ల పట్ల మన కృతజ్ఞతను చూపించవచ్చు. చెక్‌ ద్వారా విరాళం ఇవ్వాలనుకునేవాళ్లు “The Watch Tower Bible and Tract Society of India” పేరుమీద ఇవ్వాలి.

▪ మందులు: మీ ఆరోగ్య పరిస్థితి రీత్యా ఏవైనా మందులు వాడుతుంటే, సమావేశ స్థలంలో అవి దొరకవు కాబట్టి మీతోపాటు సరిపడినన్ని తెచ్చుకోండి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వాడే సిరంజిలను, సూదులను సమావేశ హాలు వద్ద, హోటళ్ల వద్ద ఉన్న సాధారణ చెత్త కుండీలలో వేయకుండా హానికరమైన వ్యర్థాలు వేసే కుండీలలో వేయాలి.

▪ పాదరక్షలు: ప్రతీ సంవత్సరం పాదరక్షల వల్ల ముఖ్యంగా ఎత్తుమడాలు ఉన్న పాదరక్షల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. మెట్ల మీద, ఏటవాలుగా ఉండే స్థలం మీద, ఎత్తుపల్లాలున్న నేల మీద నడవడానికి వీలుగా ఉండే మర్యాదకరమైన పాదరక్షలు వేసుకోవడం మంచిది.

▪ బధిరులు: ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో, సమావేశ కార్యక్రమం సంజ్ఞా భాషలో కూడా అందజేయబడుతుంది.

▪ చిన్నపిల్లల కోసం వాడే తోపుడు బళ్లు, మడత కుర్చీలు: చిన్నపిల్లల కోసం వాడే తోపుడు బళ్లు, మడత కుర్చీలు సమావేశ స్థలంలోకి తీసుకురాకూడదు. అయితే పిల్లలు సురక్షితంగా కూర్చునేలా వాళ్లను సేఫ్టీ సీటులో తల్లిదండ్రుల పక్కనే కూర్చోబెట్టుకోవచ్చు.

▪ సెంట్లు: చాలా సమావేశాలు ఏ.సీ. హాళ్లలోనే జరుగుతాయి. కాబట్టి శ్వాస సంబంధ సమస్యలు లేక తత్సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లను మనసులో ఉంచుకొని ఘాటైన సెంట్లు, అత్తర్లు అంతగా వాడకపోవడం మంచిది.—1 కొరిం. 10:24.

▪ ప్లీజ్‌ ఫాలో అప్‌ (S-43) ఫారమ్‌లు: సమావేశ సమయంలో, అవకాశం దొరికినచోట సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆసక్తి చూపించినవాళ్ల సమాచారం అందించడానికి ప్లీజ్‌ఫాలో అప్‌ ఫారమ్‌ఉపయోగించాలి. పూరించిన ఫారాలను పుస్తక విభాగానికి లేదా మీరు తిరిగి వెళ్లిన తర్వాత మీ సంఘ కార్యదర్శికి ఇవ్వవచ్చు.

▪ రెస్టారెంట్లు: రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు మీ చక్కని ప్రవర్తనతో యెహోవా నామాన్ని ఘనపర్చండి. క్రైస్తవ పరిచారకులకు తగిన దుస్తులు వేసుకోండి. ఆ ప్రాంతంలో టిప్‌ ఇచ్చే పద్ధతి ఉంటే, మీరూ ఇవ్వండి.

▪ హోటళ్లు:

(1) అవసరమయ్యే దానికన్నా ఎక్కువ గదులు రిజర్వు చేసుకోకండి, మీ గదిలో అనుమతించిన దానికన్నా ఎక్కువమందిని ఉంచుకోకండి.

(2) అత్యవసర పరిస్థితుల్లో తప్ప మీ గది రిజర్వేషన్‌ను రద్దు చేయకండి, ఒకవేళ రద్దు చేయాల్సివస్తే హోటల్‌వాళ్లకు వెంటనే తెలియజేయండి. దానివల్ల ఆ గదిని అవసరమున్న వేరేవాళ్లు ఉపయోగించుకోగలుగుతారు. (మత్త. 5:37) రిజర్వేషన్‌ను రద్దు చేసుకుంటే, మీరు రద్దు చేసుకున్నారన్న విషయాన్ని హోటల్‌వాళ్లు ధృవీకరించేలా చూసుకోండి. మీరు ఒకవేళ 48 గంటల కన్నా తక్కువ సమయం మిగిలివుండగా రద్దు చేసుకుంటే మీరు చెల్లించిన అడ్వాన్స్‌ను మీకు తిరిగివ్వరు.

(3) మీరు డెబిట్‌కార్డుగానీ క్రెడిట్‌కార్డుగానీ ఉపయోగిస్తుంటే, మీరు హోటల్‌లో దిగినప్పుడు హోటల్‌ వాళ్లు మీ గది అద్దెతో పాటు, అనుకోకుండా జరిగే నష్టాలకు అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని కూడా తమ అకౌంట్లో జమ చేసుకుంటారు. మీరు గదిని ఖాళీ చేసిన కొన్ని రోజుల తర్వాత మీ అకౌంటు సెటిలయ్యే వరకు మీరు ఆ మొత్తాన్ని ఉపయోగించుకోలేరు.

(4) లగేజ్‌కార్ట్‌ మీకు అవసరమైనప్పుడు మాత్రమే తెచ్చుకోండి, ఇతరులకు కూడా అది అవసరమవుతుంది కాబట్టి వెంటనే దానిని తిరిగి ఇచ్చేయండి.

(5) మీ ప్రాంతంలో టిప్స్‌ ఇచ్చే పద్ధతి ఉంటే, హోటల్‌ బాయ్స్‌ మీ సామాను మోసినప్పుడు టిప్‌ ఇవ్వండి; మీ గదిని శుభ్రం చేసేవాళ్లకు రోజూ టిప్‌ ఇవ్వండి.

(6) హోటల్‌ గదిలో వంట చేసుకునేందుకు అనుమతి ఉంటేనే వంట చేసుకోండి.

(7) హోటల్‌ వాళ్లు అతిథుల కోసం ఏర్పాటు చేసే అల్పాహారం, కాఫీ లేదా ఐస్‌ వంటి అదనపు ఏర్పాట్లను దుర్వినియోగం చేయకండి.

(8) హోటల్‌సిబ్బందితో వ్యవహరిస్తున్నప్పుడు ఆత్మఫలంలోని లక్షణాలను చూపించండి. వాళ్లు హోటల్‌కు వచ్చే చాలామందిని చూసుకోవాలి కాబట్టి మనం దయ, ఓర్పు, సహేతుకత చూపిస్తే వాళ్లు ఎంతో సంతోషిస్తారు.

(9) హోటల్‌ పరిసరాల్లో అంటే స్విమ్మింగ్‌ పూల్‌, రిసెప్షన్‌, లిఫ్ట్‌, జిమ్‌ వంటి స్థలాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పుడూ ఓ కంట కనిపెట్టి ఉండాలి.

(10)సిఫారసు చేయబడిన హోటళ్ల లిస్ట్‌లో గదికి ఒక రోజుకు ఎంత అద్దె కట్టాలో ఇవ్వబడింది. అయితే పన్ను అదనంగా చెల్లించాల్సివుంటుంది. కానీ దాని కంటే ఎక్కువ డబ్బు ఇవ్వమని అడిగితే ఇవ్వకండి, వీలైనంత త్వరగా ఆ విషయం రూమింగ్‌ విభాగానికి తెలియజేయండి.

(11)మీ హోటల్‌గదికి సంబంధించి ఏదైనా సమస్య ఎదురైతే, సమావేశం వద్ద ఉన్నప్పుడే రూమింగ్‌ విభాగానికి తెలియజేయండి. అలాగైతేనే వాళ్లు మీకు సహాయం చేయగలుగుతారు.

▪ స్వచ్ఛంద సేవ: స్వచ్ఛందంగా సేవ చేయాలనుకున్న వాళ్లెవరైనా సమావేశంలోని స్వచ్ఛంద సేవా విభాగం దగ్గరకు వెళ్లాలి. 16 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలు కూడా అలా సేవ చేయాలనుకుంటే వాళ్లు తల్లిదండ్రుల పర్యవేక్షణలో గానీ, వాళ్ల అనుమతి పొందిన ఇతర పెద్దవాళ్ల పర్యవేక్షణలో గానీ చేయవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి