జూలై 22తో మొదలయ్యే వారపు పట్టిక
జూలై 22తో మొదలయ్యే వారం
పాట 28, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 15వ అధ్యా., 18-23 పేరాలు, 157వ పేజీలోని బాక్సు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: అపొస్తలుల కార్యములు 22-25 (10 నిమి.)
నం. 1: అపొస్తలుల కార్యములు 22:17-30 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ ఏ విధంగా దానిలో భాగం కాకుండా ఉండవచ్చు?—యోహా. 17:15, 16 (5 నిమి.)
నం. 3: వార్త సుదూర ప్రాంతాలకు చేరింది—bm 26వ పేజీ (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: మీ విద్యార్థి హృదయాన్ని చేరుకునేలా మాట్లాడండి. (లూకా 24:32) ఈ ప్రశ్నలు ఉపయోగిస్తూ జరిపే చర్చ: (1) బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు; (ఎ) యెహోవా ప్రేమ, జ్ఞానం గురించి, (బి) బైబిలు సూత్రాలను పాటించడానికి ఉన్న ప్రాముఖ్యత గురించి, (సి) ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తప్పకుండా యెహోవా నిర్దేశం కోసం ప్రయత్నించడం గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి? (2) మీరు మీ విద్యార్థి హృదయాన్ని చేరుకునేలా మాట్లాడుతున్నారో లేదో తెలుసుకోవడానికి, అతనిని ఈ కింది ప్రశ్నలు అడగడం ఎందుకు మంచిది? (ఎ) ఇది మీకు సమంజసంగానే అనిపిస్తోందా? (బి) ప్రేమగల దేవుడు ఇలాగే చేస్తాడని మీకు అనిపిస్తోందా? (సి) ఈ సలహా పాటించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
20 నిమి: “యౌవన సహోదరులారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటున్నారా?”
ప్రశ్నాజవాబులు. యువకునిగా ఉన్నప్పుడే పెద్దగా, పరిచర్య సేవకునిగా నియామకం పొందిన సహోదరుణ్ణి క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. పరిచర్య సేవకునిగా నియమించక ముందు ఆయన ఎలాంటి నియామకాలు, తర్ఫీదు పొందాడు? ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి సంఘంలోని వాళ్లు ఆయనకు ఎలా సహాయం చేశారు? బాధ్యతలు చేపట్టడానికి తగిన అర్హతలు సంపాదించుకోవడం వల్ల ఆయన ఎలాంటి ఆశీర్వాదాలు పొందాడు?
పాట 26, ప్రార్థన