కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/15 పేజీలు 4-6
  • సమావేశ జ్ఞాపికలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సమావేశ జ్ఞాపికలు
  • మన రాజ్య పరిచర్య—2015
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉండండి’
    మన రాజ్య పరిచర్య—2014
  • దేవుణ్ణి మహిమపర్చే ప్రవర్తన
    మన రాజ్య పరిచర్య—2013
  • మూడు రోజుల ఆధ్యాత్మిక విందు
    మన రాజ్య పరిచర్య—2011
  • మన జిల్లా సమావేశాలు—సత్యం గురించి శక్తివంతంగా సాక్ష్యమిస్తాయి
    మన రాజ్య పరిచర్య—2012
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2015
km 7/15 పేజీలు 4-6

సమావేశ జ్ఞాపికలు

  • కార్యక్రమ వేళలు: సమావేశపు హాలు తలుపులు ఉదయం 8:00 గంటలకు తెరుస్తారు. మూడు రోజులూ, ప్రారంభ సంగీతం ఉదయం 9:20కి మొదలవుతుంది. కార్యక్రమం క్రమపద్ధతిలో, గౌరవప్రదంగా ఆరంభమవ్వాలంటే ఆ సమయానికల్లా మనమందరం సీట్లలో కూర్చోవాలి. కార్యక్రమం శుక్ర, శనివారాలు సాయంత్రం 5:00కు, ఆదివారం 4:00కి ముగుస్తుంది.

  • ‘పాటలతో యెహోవాను స్తుతించండి’: ప్రాచీన కాలాల్లో దేవుని ప్రజలు కీర్తనలతో యెహోవాను స్తుతించేవాళ్లు, నేడు కూడా సత్యారాధనలో సంగీతానికి ముఖ్యమైన పాత్ర ఉంది. (కీర్త. 28:7) మన ప్రాదేశిక సమావేశంలోని ఉదయం, మధ్యాహ్న కార్యక్రమాలు సంగీతంతో మొదలౌతాయి. ఇది కేవలం నేపథ్య సంగీతం కాదు, మనం యెహోవా గురించి నేర్చుకుని, ఆయన్ను ఆరాధించడానికి చేసిన సంగీతం. కాబట్టి సంగీతం మొదలౌతుందని ప్రకటించినప్పుడు, మాట్లాడుకోవడం ఆపేసి సీట్లలో కూర్చుని సంగీతాన్ని వినాలి. అలా మనం వాచ్‌టవర్‌ వాద్యబృందం చేసిన కృషికి విలువిస్తున్నామని చూపిస్తాం. మనం సంతోషించే చక్కని సంగీతాన్ని తయారుచేయడానికి సహోదరసహోదరీలు సంవత్సరానికి రెండు సార్లు వాళ్ల సొంత ఖర్చులతో న్యూయార్క్‌లోని ప్యాటర్‌సన్‌కు వస్తారు. సమావేశంలో మనం సంగీతాన్ని శ్రద్ధగా విన్న తర్వాత, ప్రతీ ఒక్కరం రాజ్యగీతాలను పాడి యెహోవాను స్తుతించాలి.

  • పార్కింగ్‌: సమావేశ స్థలాల్లో, స్థలం అందుబాటులో ఉన్నంతవరకు అందరూ తమ వాహనాలను ఉచితంగా పార్క్‌ చేసుకోవచ్చు. అయితే, సాధారణంగా పార్కింగ్‌ స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి, ఒక కారులో కేవలం ఒకరిద్దరే కాకుండా వీలైనంతమంది రావడానికి ప్రయత్నించాలి.

  • సీట్లు పెట్టుకోవడం: ప్రతీరోజు సమావేశ హాలు తలుపులు తెరవగానే, తోటివాళ్లతో పోటీపడుతున్నట్లు దయచేసి పరుగెత్తకండి. ఇతరుల గురించి ఆలోచించండి, అవసరమైతే మన సహోదరుల కోసం మీరు కోరుకున్న సీట్లను త్యాగం చేయవచ్చు. ఇతరుల మేలుకోరి మనం చూపించే స్వయంత్యాగ స్ఫూర్తి మనం నిజక్రైస్తవులమని చూపిస్తుంది. దాన్నిబట్టి, ఇతరులు దేవుణ్ణి మహిమపరుస్తారు. (యోహా. 13:34, 35; 1 కొరిం. 13:5; 1 పేతు. 2:12) మీ ఇంట్లోవాళ్లకు, మీతోపాటు వాహనంలో వచ్చినవాళ్లకు, మీ ప్రస్తుత బైబిలు విద్యార్థులకు మాత్రమే సీట్లు పెట్టుకోవచ్చు, దయచేసి ఆ సీట్లలో తప్ప వేరే సీట్లలో ఏ వస్తువులూ పెట్టవద్దు. వృద్ధుల కోసం, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ల కోసం ప్రత్యేకంగా సీట్లు ఉంటాయి. అవి కొన్నే ఉంటాయి కాబట్టి, ఆ సీట్లలో వాళ్లు, వాళ్లను దగ్గరుండి చూసుకునే ఒకరిద్దరు మాత్రం కూర్చోవచ్చు.

  • మర్యాదగా ఉండే బట్టలు వేసుకోండి: సమావేశాల్లో మనం వేసుకునే బట్టల్లో లోకంలోని విచ్చలవిడితనం కనిపించకూడదు. మనం వేసుకునే బట్టలు మర్యాదగా, అణకువగా ఉండాలి. (1 తిమో. 2:9) హోటల్‌కు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు; కార్యక్రమం ముందు, తర్వాత విరామ సమయాల్లో కూడా మన బట్టలు మర్యాదకరంగా ఉండాలి. అప్పుడు మన సమావేశ బాడ్జిని పెట్టుకోవడానికి సందేహించం, అవకాశం దొరికినప్పుడు సాక్ష్యం ఇవ్వగలుగుతాం. సమావేశాల్లో మన మర్యాదకరమైన బట్టలు, ప్రవర్తన యథార్థ హృదయులను బైబిల్లోని ప్రాణాలు రక్షించే సందేశం వైపు ఆకర్షించడమేకాక యెహోవాకు సంతోషాన్ని తీసుకొస్తుంది.—జెఫ. 3:17.

  • ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఉపయోగిస్తున్నప్పుడు ఈ సలహాలు పాటించండి: సమావేశం జరుగుతున్నప్పుడు మన సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఇతరులకు ఇబ్బంది కలిగించని విధంగా సెట్‌ చేసుకోవాలి. కెమెరా, వీడియో రికార్డర్‌, ఎలక్ట్రానిక్‌ టాబ్లెట్‌ వంటివి ఉపయోగిస్తున్నప్పుడు ఇతరులకు అడ్డురాకుండా చూసుకోవాలి. సమావేశం జరుగుతున్నప్పుడు అనవసరంగా మెసేజ్‌లు లేదా ఈ-మెయిల్స్‌ పంపించకపోవడం కూడా మంచి మర్యాద.

  • మధ్యాహ్న భోజనం: మధ్యాహ్న భోజనం కోసం హాలు ప్రాంగణం వదిలి బయటకు వెళ్లే బదులు, దయచేసి మీతోపాటే కొద్దిపాటి ఆహారం తెచ్చుకోండి. కుర్చీ కింద పెట్టుకోగలిగే చిన్న డబ్బాలో ఆహారం తెచ్చుకోవచ్చు. కుటుంబం మొత్తానికి సరిపోయే పెద్దపెద్ద డబ్బాలు, గాజు వస్తువులు తీసుకురాకూడదు.

  • విరాళాలు: సమావేశంలో, ప్రపంచవ్యాప్త పని కోసం స్వచ్ఛంద విరాళాలు ఇచ్చి సమావేశ ఏర్పాట్ల పట్ల కృతజ్ఞత చూపించవచ్చు. చెక్‌ ద్వారా విరాళం ఇవ్వాలనుకునేవాళ్లు “The Watch Tower Bible and Tract Society of India” పేరుమీద ఇవ్వాలి. కొన్ని సమావేశ హాళ్లలో డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు ద్వారా కూడా విరాళాలు ఇవ్వవచ్చు.

  • మందులు: మీ ఆరోగ్య రీత్యా ఏవైనా మందులు వాడుతుంటే, సమావేశ స్థలంలో అవి దొరకవు కాబట్టి మీతోపాటు సరిపడా మందులు తెచ్చుకోండి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వాడే సిరంజిలను, సూదులను సమావేశ హాలు లేదా హోటల్‌ దగ్గరున్న సాధారణ చెత్తకుండీల్లో వేయకుండా హానికరమైన వ్యర్థాలు వేసే కుండీల్లో వేయాలి.

  • జాగ్రత్తలు: జారిపడడం, తొట్రుపడడం వల్ల అయ్యే గాయాలు నివారించే విషయంలో దయచేసి ప్రత్యేక జాగ్రత్త తీసుకోండి. హాలులో పిల్లల్ని ఇటూఅటూ పరుగెత్తనివ్వకూడదు. ప్రతీ సంవత్సరం చెప్పుల వల్ల ముఖ్యంగా ఎత్తుమడాలున్న చెప్పుల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. మెట్ల మీద, ఏటవాలుగా ఉండే స్థలం మీద, ఎత్తుపల్లాలున్న నేల మీద నడవడానికి వీలుగా ఉండే మర్యాదకరమైన చెప్పులు వేసుకోవడం మంచిది.

  • చిన్నపిల్లల ట్రాలీలు, మడత కుర్చీలు: చిన్నపిల్లల ట్రాలీలు, మడత కుర్చీలు సమావేశ స్థలంలోకి తీసుకురాకూడదు. అయితే పిల్లలు సురక్షితంగా కూర్చునేలా వాళ్లను సేఫ్టీ సీటులో పెట్టి తల్లిదండ్రుల పక్కనే కుర్చీలో కూర్చోబెట్టుకోవచ్చు.

  • సెంట్లు: చాలా సమావేశాలు ఏ.సీ. హాళ్లలోనే జరుగుతాయి. కాబట్టి శ్వాస సంబంధ సమస్యలు, అలాంటి వేరే సమస్యలు ఉన్నవాళ్లను మనసులో ఉంచుకొని ఘాటైన సెంట్లు, స్ప్రేలు తక్కువగా వాడడం మంచిది.—1 కొరిం. 10:24.

  • ప్లీజ్‌ ఫాలో అప్‌ (S-43) ఫారమ్‌లు: సమావేశ సమయంలో, అనియత సాక్ష్యమిచ్చినప్పుడు ఆసక్తి చూపించినవాళ్ల సమాచారం అందించడానికి ప్లీజ్‌ఫాలో అప్‌ ఫారమ్‌ ఉపయోగించాలి. పూరించిన ఫారమ్‌లను పుస్తక విభాగానికి లేదా మీరు తిరిగివెళ్లిన తర్వాత మీ సంఘ కార్యదర్శికి ఇవ్వవచ్చు.

  • రెస్టారెంట్లు: రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు మీ చక్కని ప్రవర్తనతో యెహోవా నామాన్ని ఘనపర్చండి. క్రైస్తవ పరిచారకులకు తగిన దుస్తులు వేసుకోండి. ఆ ప్రాంతంలో టిప్‌ ఇచ్చే పద్ధతి ఉంటే, మీరూ టిప్‌ ఇవ్వండి.

  • హోటళ్లు:

    1. అవసరమయ్యే దానికన్నా ఎక్కువ గదులు బుక్‌చేసుకోకండి, మీ గదిలో అనుమతించిన దానికన్నా ఎక్కువమందిని ఉంచుకోకండి.

    2. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మీ గది బుకింగ్‌రద్దు చేయకండి, ఒకవేళ రద్దు చేయాల్సివస్తే హోటల్‌వాళ్లకు వెంటనే తెలియజేయండి. దానివల్ల ఆ గదిని వేరేవాళ్లు ఉపయోగించుకోగలుగుతారు. (మత్త. 5:37) బుకింగ్‌ రద్దు చేసుకుంటే, ఆ విషయాన్ని హోటల్‌ వాళ్లు ధృవీకరించేలా చూసుకోండి.

    3. మీరు డెబిట్‌కార్డుగానీ క్రెడిట్‌కార్డుగానీ ఉపయోగిస్తుంటే, మీరు హోటల్‌లో దిగినప్పుడు హోటల్‌ వాళ్లు మీ గది అద్దెతోపాటు, అనుకోకుండా జరిగే నష్టాలకు అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని కూడా తమ అకౌంట్లో జమ చేసుకుంటారు. మీరు గదిని ఖాళీ చేసిన కొన్ని రోజుల తర్వాత మీ అకౌంటు సెటిలయ్యే వరకు మీరు ఆ మొత్తాన్ని ఉపయోగించుకోలేరు.

    4. అవసరమైనప్పుడు మాత్రమే లగేజ్‌కార్ట్‌ తెచ్చుకోండి, అది ఇతరులకు కూడా అవసరమౌతుంది కాబట్టి పని అయిపోగానే తిరిగి ఇచ్చేయండి.

    5. మీ ప్రాంతంలో టిప్స్‌ ఇచ్చే పద్ధతి ఉంటే, హోటల్‌ బాయ్స్‌ మీ సామాను మోసినప్పుడు టిప్‌ ఇవ్వండి; మీ గదిని శుభ్రం చేసేవాళ్లకు టిప్‌ ఇవ్వండి.

    6. హోటల్‌ గదిలో వంట చేసుకునేందుకు అనుమతి ఉంటేనే వంట చేసుకోండి.

    7. హోటల్‌ వాళ్లు తమ అతిథుల కోసం ఏర్పాటు చేసే అల్పాహారం, కాఫీ, ఐస్‌ వంటివాటిని అతిగా తీసుకోకూడదు.

    8. హోటల్‌సిబ్బందితో వ్యవహరిస్తున్నప్పుడు ఆత్మఫలంలోని లక్షణాలను చూపించండి. వాళ్లు హోటల్‌కు వచ్చే చాలామందిని చూసుకోవాలి కాబట్టి మనం దయ, ఓర్పు, సహేతుకత చూపిస్తే వాళ్లు ఎంతో సంతోషిస్తారు.

    9. హోటల్‌ పరిసరాల్లో అంటే స్విమ్మింగ్‌ పూల్‌, రిసెప్షన్‌, లిఫ్ట్‌, జిమ్‌ వంటి స్థలాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పుడూ ఓ కంట కనిపెట్టుకోవాలి.

    10. సిఫారసు చేయబడిన హోటళ్ల జాబితాలో గదికి ఒక రోజుకు ఎంత అద్దె కట్టాలో ఉంటుంది. అయితే అదనంగా పన్ను చెల్లించాల్సివుంటుంది. కానీ దాని కంటే ఎక్కువ డబ్బు ఇవ్వమని అడిగితే ఇవ్వకండి, వీలైనంత త్వరగా ఆ విషయం రూమింగ్‌ విభాగానికి తెలియజేయండి.

    11. మీ హోటల్‌గదికి సంబంధించి ఏదైనా సమస్య తలెత్తితే, సమావేశం వద్ద ఉన్నప్పుడే రూమింగ్‌విభాగానికి తెలియజేయండి. అలాగైతేనే వాళ్లు మీకు సహాయం చేయగలుగుతారు.

  • స్వచ్ఛంద సేవ: స్వచ్ఛందంగా సేవ చేయాలనుకున్న వాళ్లెవరైనా, సమావేశంలోని స్వచ్ఛంద సేవా విభాగం దగ్గరకు వెళ్లాలి. 16 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలు కూడా అలా సేవ చేయాలనుకుంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో గానీ, తల్లిదండ్రుల అనుమతి పొందిన ఇతర పెద్దవాళ్ల పర్యవేక్షణలో గానీ చేయవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి