కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/11 పేజీలు 3-7
  • మూడు రోజుల ఆధ్యాత్మిక విందు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మూడు రోజుల ఆధ్యాత్మిక విందు
  • మన రాజ్య పరిచర్య—2011
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన జిల్లా సమావేశాలు—సత్యం గురించి శక్తివంతంగా సాక్ష్యమిస్తాయి
    మన రాజ్య పరిచర్య—2012
  • దేవుణ్ణి మహిమపర్చే ప్రవర్తన
    మన రాజ్య పరిచర్య—2013
  • ‘అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉండండి’
    మన రాజ్య పరిచర్య—2014
  • జిల్లా సమావేశాలు—సంతోషంగా ఆరాధించే సమయం
    మన రాజ్య పరిచర్య—2010
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2011
km 7/11 పేజీలు 3-7

మూడు రోజుల ఆధ్యాత్మిక విందు

1. ఈ సంవత్సరం జిల్లా సమావేశం నుండి మనం ఎలా ప్రయోజనం పొందుతాం?

1 ఆధ్యాత్మికంగా మలమల మాడిపోతున్న సాతాను లోకంలో యెహోవా తన సేవకులను పోషిస్తూనే ఉన్నాడు. (యెష. 58:11) మనల్ని బలపర్చడానికి యెహోవా చేసే ఏర్పాట్లలో వార్షిక జిల్లా సమావేశం ఒకటి. ఈ సంవత్సరం జిల్లా సమావేశం దగ్గరపడుతోంది కాబట్టి యెహోవా నుండి ఉపదేశం పొందడానికి, ఇతరులను ప్రోత్సహించడానికి మనం ఎలా సిద్ధపడవచ్చు?—సామె. 21:5.

2. మనం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి?

2 మీరు ఇప్పటికే సిద్ధపడకపోతే, సమావేశానికి మూడు రోజులూ హాజరవ్వగలిగేలా మీ సొంత పనులను, ఉద్యోగానికి సంబంధించిన పనులను సర్దుబాటు చేసుకోవడానికి సమయం తీసుకోండి. ప్రతీరోజు కార్యక్రమం మొదలవడానికి ముందే సమావేశ స్థలానికి చేరుకొని మీ సీట్లలో కూర్చోవాలంటే, ఎంత ముందుగా బయల్దేరాలో చూసుకున్నారా? యెహోవా మనల్ని బలపర్చడానికి ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక విందులో దేన్నీ పోగొట్టుకోకూడదని మనం కోరుకుంటాం. (యెష. 65:13, 14) వసతికి, ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారా?

3. ఏ సలహాలు పాటిస్తే మనం, మన కుటుంబం సమావేశం నుండి పూర్తి ప్రయోజనం పొందుతుంది?

3 కార్యక్రమానికి పూర్తి అవధానం ఇవ్వాలంటే మీరేమి చేయవచ్చు? వీలైతే, సమావేశ రోజుల్లో రాత్రిపూట బాగా విశ్రాంతి తీసుకోండి. ప్రసంగీకుని వైపే చూడండి. చెప్పే ప్రతీ లేఖనాన్ని మీ బైబిల్లో చూడండి. క్లుప్తంగా నోట్సు రాసుకోండి. కుటుంబమంతా కలిసి కూర్చుంటే, పిల్లలు కూడా శ్రద్ధగా వినేలా తల్లిదండ్రులు సహాయం చేయవచ్చు. (సామె. 29:15) ప్రతీరోజు సాయంత్రం, సమావేశ ముఖ్యాంశాల గురించి కుటుంబమంతా కలిసి చర్చించవచ్చు. అలాగే, సమావేశం ముగిసిన తర్వాత కూడా మీరు ప్రయోజనం పొందగలిగేలా, మీ కుటుంబం పాటించాల్సిన అంశాల గురించి పరిశీలించడానికి కుటుంబ ఆరాధనా సాయంత్రంలో కొంత సమయం వెచ్చించవచ్చు.

4. సమావేశం నుండి ప్రయోజనం పొందేలా సంఘంలోని ఇతరులకు మనమెలా సహాయం చేయవచ్చు?

4 ప్రయోజనం పొందడానికి ఇతరులకు సహాయం చేయండి: ఇతరులు కూడా సమావేశం నుండి ప్రయోజనం పొందాలని మనం కోరుకుంటాం. మీ సంఘంలో, సమావేశానికి హాజరవడానికి సహాయం అవసరమయ్యే వృద్ధ ప్రచారకులు లేదా ఇతరులు ఉన్నారా? మీరు వాళ్లకు సహాయం చేయగలరా? (1 యోహా. 3:17, 18) పెద్దలు, ముఖ్యంగా ఆయా గుంపుల పర్యవేక్షకులు అలాంటి ప్రచారకులకు అవసరమైన సహాయం అందేలా చూడాలి.

5. సమావేశ ఆహ్వాన పత్రాలను మనమెలా పంచిపెడతాం? (5వ పేజీలోవున్న బాక్సు చూడండి.)

5 ముందులాగే, ఇతరులను ఆహ్వానించడానికి సమావేశం మొదలవడానికి మూడు వారాల ముందు నుండి మనం ప్రచార కార్యక్రమంలో పాల్గొంటాం. సంఘాలు, తమకు కేటాయించబడిన ఆహ్వాన ప్రతులన్నిటినీ పంచిపెట్టాలనే, తమ క్షేత్రంలో వీలైనంత ఎక్కువమందిని చేరుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. అది సమస్యాత్మక క్షేత్రమైతే, ఆహ్వాన పత్రాన్ని ఇవ్వడానికి ముందు గృహస్థునికి ఆసక్తి ఉందో లేదో నిర్ధారించుకోవడం అవసరం. ప్రచార కార్యక్రమం ముగిసిన తర్వాత మీ దగ్గర ఆహ్వాన పత్రాలు మిగిలిపోతే, అనియత సాక్ష్యం ఇవ్వడానికి ఉపయోగించేందుకు వాటిని సమావేశానికి తీసుకురండి. శుక్రవారం కార్యక్రమంలో దీని గురించి ఎక్కువ సమాచారం ఇవ్వబడుతుంది. సమావేశం జరిగే నగరంలో మీరు ఉపయోగించకపోవచ్చు అనుకున్న ఆహ్వాన పత్రాలను సమావేశ హాలుకు వచ్చిన తర్వాత అక్కడ అటెండెంట్‌కు ఇవ్వండి. దయచేసి ఒక పత్రాన్ని మీ కోసం ఉంచుకోండి, ఎందుకంటే ఆదివారం ఇవ్వబడే చివరి ప్రసంగంలో అది అవసరమౌతుంది.

6. సమావేశంలో మనం మంచి మర్యాదలు ఏయే విధాలుగా చూపించవచ్చు?

6 మన మంచి మర్యాదలు చూసి ఇతరులు సంతోషిస్తారు: ఎక్కువమంది ప్రజలు ‘స్వార్థపరులుగా,’ ఇతరుల భావాలను పట్టించుకోని వాళ్లుగా ఉన్న ఈ కాలంలో మంచి మర్యాదలు చూపించడానికి కృషిచేసే తోటి క్రైస్తవుల మధ్య ఉండడం ఎంత సంతోషాన్నిస్తుందో కదా! (2 తిమో. 3:2) సమావేశ హాలును ఉదయం 8 గంటలకు తెరిచినప్పుడు నెమ్మదిగా, ఓ క్రమ పద్ధతిలో హాల్లోకి వెళ్లడం ద్వారా, మన ఇంట్లో వాళ్లకు, మన కార్లో ప్రయాణించే వాళ్లకు లేదా ఇప్పటి బైబిలు విద్యార్థులకు మాత్రమే సీట్లు పెట్టుకోవడం ద్వారా మనం మంచి మర్యాదలు చూపిస్తాం. కార్యక్రమం మొదలవడానికి ముందు అందర్నీ సీట్లలో కూర్చుని సంగీతం వినమని చైర్మన్‌ నిర్దేశించినప్పుడు మనం దాన్ని పాటిస్తాం. కార్యక్రమం జరుగుతున్నప్పుడు మన సెల్‌ఫోను, పేజరు ఇతరులకు ఆటంకం కలిగించకుండా చూసుకోవడంతోపాటు మాట్లాడడం, మెసేజ్‌లు పంపించడం, తినడం, అనవసరంగా వసారాలో తిరగడం వంటివి చేయకుండా ఉండడం ద్వారా మనం మంచి మర్యాదలున్న వాళ్లమని చూపిస్తాం.

7. మన సహోదరులతో సహవసిస్తున్నప్పుడు ఒకరినొకరం ఎలా ప్రోత్సహించుకోవచ్చు?

7 ప్రోత్సాహాన్నిచ్చే సహవాసం: సమావేశాల్లో, ప్రోత్సాహాన్నిచ్చే మన క్రైస్తవ ఐక్యతను, సహోదరత్వాన్ని ఆస్వాదించడానికి మనకు ఎన్నో అవకాశాలు దొరుకుతాయి. (కీర్త. 133:1-3) ‘మీ హృదయాలను విశాలపరచుకుని’ ఇతర సంఘాల నుండి వచ్చిన సహోదరసహోదరీలను కలవడానికి ఎందుకు చొరవ తీసుకోకూడదు? (2 కొరిం. 6:13) ప్రతీరోజు కనీసం ఒక్క కొత్త వ్యక్తినైనా లేదా కుటుంబాన్నైనా పరిచయం చేసుకోవాలనే లక్ష్యాన్ని మీరు పెట్టుకోవచ్చు. అందుకు మధ్యాహ్న విరామం సమయం మంచి అవకాశాన్నిస్తుంది. కాబట్టి భోజనం కొనడానికి లేదా తినడానికి దగ్గర్లోని రెస్టారెంటుకు వెళ్లే బదులు అల్పాహారాన్ని మీతోపాటే తెచ్చుకోండి. మీరు తెచ్చుకున్న ఆహారాన్ని సమావేశ స్థలంలో తింటూ ఇతరులతో సహవాసాన్ని ఆనందించండి. అలా మీరు కొత్త స్నేహితులను, కలకాలముండే స్నేహితులను సంపాదించుకుంటారు.

8. సమావేశంలో పని చేయడానికి మనం ఎందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి? దాన్ని మనమెలా చేయవచ్చు?

8 పవిత్ర సేవలో తోటి ఆరాధకులతో కలిసి పనిచేయడం మనకు ఎంత ప్రోత్సాహాన్నిస్తుందో కదా! మీరు ఏదైనా విభాగంలో స్వచ్ఛంద సేవ చేయగలరా? లేదా శుభ్రపరిచే పనిలో మీ సంఘంతోపాటు పని చేయగలరా? (కీర్త. 110:3) సమావేశంలో మీకు ఏ నియామకం లేకపోతే దయచేసి స్వచ్ఛంద సేవా విభాగాన్ని సంప్రదించడానికి ప్రయత్నించండి. ఎక్కువ చేతులు కలిస్తే పని సంతోషాన్నిస్తుంది, అది తేలిక కూడా అవుతుంది.

9. సమావేశమప్పుడు మన ప్రవర్తనకు, మనం కనిపించే తీరుకు ఎందుకు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వాలి?

9 ఇతరులు మన ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతారు: కార్యక్రమం జరుగుతున్నప్పుడే కాదు సమావేశం జరిగే మూడు రోజులూ మనం దానికి ప్రాతినిధ్యం వహిస్తాం. సమావేశ నగరంలో మనం ఉన్నంత కాలం, మనకూ సాక్షులుకాని వాళ్లకూ మధ్యవున్న తేడా మనల్ని గమనించే వాళ్లకు స్పష్టంగా కనిపించాలి. (1 పేతు. 2:12) సమావేశ స్థలంలో ఉన్నప్పుడు, హోటల్లో ఉన్నప్పుడు, రెస్టారెంటుకు వెళ్లినప్పుడు మన వస్త్రధారణ, కనిపించే తీరు యెహోవాకు ఘనత తీసుకొచ్చే విధంగా ఉండాలి. (1 తిమో. 2:9, 10) మనం బాడ్జి కార్డులు పెట్టుకుంటే, చూసేవాళ్లు మనం యెహోవాసాక్షులమని గుర్తించగలుగుతారు. దానివల్ల వాళ్లకు మన సమావేశం గురించి చెప్పడానికి, ఎక్కువ సాక్ష్యం ఇవ్వడానికి మనకు అవకాశం దొరకవచ్చు.

10. హోటల్లో, రెస్టారెంటులో పని చేసేవాళ్లు మన సమావేశం గురించి మంచి అభిప్రాయం కలిగివుండాలంటే మనమేమి చేయాలి?

10 హోటల్లో, రెస్టారెంటులో పని చేసేవాళ్లకు మనమెలా సహకరించవచ్చు? మనం ఉపయోగించే దానికన్నా ఎక్కువ గదులు రిజర్వ్‌ చేసుకోకూడదు. అలాచేస్తే ఇతర సహోదరులకు గదులు దొరకకపోవడమే కాదు, హోటల్‌ వాళ్లకు వ్యాపారంలో వచ్చే నష్టాన్ని పూరించుకోవడం ఎంతో కష్టమౌతుంది. మనం హోటల్లో దిగుతున్నప్పుడు లేదా దాన్ని ఖాళీ చేసి వెళ్తున్నప్పుడు కౌంటర్‌ దగ్గర రద్దీ ఉంటే ఓర్పును, దయను చూపించాలి. (కొలొ. 4:6) రెస్టారెంటులో సర్వర్‌లకు, హోటల్లో మన లగేజీని మోసేవాళ్లకు, గదిని శుభ్రం చేసేవాళ్లకు, ఇతర సేవలు అందించే వాళ్లకు సాధారణంగా ఇచ్చే టిప్‌ ఇవ్వాలి.

11. మన క్రైస్తవ ప్రవర్తన చక్కని సాక్ష్యం ఇస్తుందని ఏ అనుభవాలు చూపిస్తున్నాయి?

11 సమావేశం జరిగే సమయంలో మన మంచి ప్రవర్తన ఇతరులపై ఎలాంటి ముద్ర వేస్తుంది? ఒక వార్తాపత్రిక ప్రకారం, సమావేశం జరిగిన ఒక హాలు యజమాని ఇలా చెప్పాడు: “వాళ్లు ఎంతో మర్యాదస్థులు. ప్రతీ సంవత్సరం వాళ్లు ఇక్కడకు రావడం ఎంతో సంతోషాన్నిస్తుంది.” పోయిన సంవత్సరం, సమావేశానికి హాజరైన వాళ్లు బస చేసిన ఒక హోటల్లో సాక్షికాని వ్యక్తి తన పర్సు పోగొట్టుకున్నాడు. పర్సును ఉన్నదున్నట్టు హోటల్‌ యజమానికి ఇచ్చినప్పుడు, పర్సు పోగొట్టుకున్న వ్యక్తితో ఆయన ఇలా అన్నాడు: “దగ్గర్లో జరుగుతున్న తమ సమావేశానికి హాజరవడానికి వచ్చిన యెహోవాసాక్షులతో ఈ హోటల్‌ నిండివుండడం మీకు మంచిదైంది. లేకపోతే పర్సు మళ్లీ మీ చేతికి వచ్చి ఉండేది కాదు.”

12. సమావేశం దగ్గరపడుతోంది కాబట్టి మన లక్ష్యం ఏమైవుండాలి? ఎందుకు?

12 ఈ సంవత్సరం జిల్లా సమావేశాలు త్వరలో జరగబోతున్నాయి. సమావేశ కార్యక్రమాన్ని, పరిసరాలను ఆహ్లాదకరంగా చేయడానికి ఎంతో సమయం, శక్తి వెచ్చించబడ్డాయి. మూడు రోజులూ హాజరవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. మీకోసం యెహోవా, ఆయన సంస్థ ఏర్పాటు చేసిన దాన్నుండి ప్రయోజనం పొందడానికి సిద్ధంగా ఉండండి. మంచి మర్యాదలతో, సంతోషకరమైన సహవాసంతో, మంచి ప్రవర్తనతో ఇతరులకు ప్రయోజనం చేకూర్చాలని తీర్మానించుకోండి. అలాచేస్తే, గత సంవత్సరం సమావేశానికి హాజరైన ఒకామెకు అనిపించినట్లే మీకు, ఇతరులకు అనిపిస్తుంది. ఆమె ఇలా అంది: “ఇంతకన్నా సంతృప్తికరమైన అనుభవం నాకు గుర్తు రావడం లేదు!”

[4వ పేజీలోని బ్లర్బ్‌]

గతంలోలాగే, ఇతరులను ఆహ్వానించడానికి సమావేశం మొదలవడానికి మూడు వారాల ముందు నుండి మనం ప్రచార కార్యక్రమంలో పాల్గొంటాం

[6వ పేజీలోని బ్లర్బ్‌]

సమావేశ స్థలంలో ఉన్నప్పుడు, హోటల్లో ఉన్నప్పుడు, రెస్టారెంటుకు వెళ్లినప్పుడు మన వస్త్రధారణ, కనిపించే తీరు యెహోవాకు ఘనత తీసుకొచ్చే విధంగా ఉండాలి

[7వ పేజీలోని బ్లర్బ్‌]

మంచి మర్యాదలతో, సంతోషకరమైన సహవాసంతో, మంచి ప్రవర్తనతో ఇతరులకు ప్రయోజనం చేకూర్చాలని తీర్మానించుకోండి

[4వ పేజీలోని చిత్రం]

2011 జిల్లా సమావేశ జ్ఞాపికలు

▪ కార్యక్రమ వేళలు: మూడు రోజులూ కార్యక్రమం ఉదయం 9:20లకు మొదలవుతుంది. ఉదయం 8 గంటలకు తలుపులు తెరుస్తారు. కార్యక్రమం క్రమపద్ధతిలో, గౌరవప్రదంగా ఆరంభమవ్వాలంటే ప్రారంభ సంగీతం మొదలౌతుందనే ప్రకటన వినగానే మనందరం సీట్లలో కూర్చోవాలి. శుక్ర, శని వారాల్లో కార్యక్రమం సాయంత్రం 4:55లకు ముగుస్తుంది, ఆదివారం సాయంత్రం 3:40లకు ముగుస్తుంది.

▪ పార్కింగ్‌: సమావేశ స్థలాల్లో పార్కింగ్‌ స్థలం అందరికీ ఉచితంగా ఇవ్వబడుతుంది. స్థలం అందుబాటులో ఉన్నంతవరకు, హాజరైనవాళ్లంతా తమ వాహనాలను పార్క్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, సాధారణంగా పార్కింగ్‌ స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి, ఒక కారులో కేవలం ఒకరిద్దరే కాకుండా, కొంతమంది కలిసి రావడానికి ప్రయత్నించాలి.

▪ సీట్లు పెట్టుకోవడం: మన ఇంట్లో వాళ్లకు, మనతోపాటు కారులో ప్రయాణించే వాళ్లకు, లేదా ప్రస్తుతం మనం బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్న వాళ్లకు మాత్రమే సీట్లు పెట్టుకోవచ్చు.—1 కొరిం. 13:5.

▪ మధ్యాహ్న భోజనం: మధ్యాహ్నం విరామ సమయంలో తినడానికి సమావేశ స్థలాన్ని విడిచి వెళ్లే బదులు, కుర్చీ కింద పెట్టుకోగలిగే చిన్న సంచిలో అల్పాహారాన్ని దయచేసి మీ వెంట తెచ్చుకోండి. సమావేశ స్థలంలోకి పెద్దపెద్ద భోజనపు బుట్టలను, గాజు వస్తువులను తీసుకురాకూడదు. సమావేశ కమిటీ అల్పాహార లేదా భోజన ఏర్పాట్లు చేయదు.

▪ విరాళాలు: సమావేశంలో ప్రపంచవ్యాప్త పని కోసం స్వచ్ఛంద విరాళాలు ఇవ్వడం ద్వారా సమావేశ ఏర్పాట్ల పట్ల మన కృతజ్ఞతను చూపించవచ్చు. చెక్‌రూపంలో విరాళం ఇవ్వాలనుకున్నవాళ్లు “The Watch Tower Bible and Tract Society of India” పేరుమీద ఇవ్వాలి.

▪ ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు: సమావేశ స్థలంలో ఎవరికైనా అత్యవసరంగా వైద్య సహాయం అవసరమైతే దగ్గర్లో ఉన్న అటెండెంటును సంప్రదించండి, అర్హతగల ప్రథమ చికిత్సా సిబ్బంది పరిస్థితిని అంచనా వేసి సహాయపడేందుకు, వెంటనే ఆయన దానిని ప్రథమ చికిత్సా విభాగం దృష్టికి తీసుకువెళ్తాడు. అవసరమనుకుంటే ప్రథమ చికిత్సా సిబ్బంది అంబులెన్సును పిలుస్తాడు. అలాచేస్తే అత్యవసర సమయంలో సేవచేసే వాళ్లకు ఎక్కువ ఫోన్‌ కాల్స్‌ వెళ్లకుండా ఉంటాయి.

▪ మందులు: మీకు డాక్టరు రాసిచ్చిన మందులు అవసరమైతే సమావేశ స్థలంలో అవి దొరకవు కాబట్టి మీతోపాటు కావలసినన్ని తెచ్చుకోండి.

▪ చెప్పులు: చాలామందికి తాము వేసుకొనే చెప్పుల వల్ల ప్రతీ సంవత్సరం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. మెట్ల మీద, ర్యాంపు మీద లేదా ఎత్తుపల్లాలున్న నేల మీద నడవడానికి వీలుగా ఉండేలా సరిగ్గా సరిపోయే, సౌకర్యవంతమైన చెప్పులు వేసుకోవడం మంచిది.

▪ సెంట్లు: కృత్రిమ వెంటిలేషన్‌ మాత్రమే ఉండే హాళ్లలో కొన్ని సమావేశాలు జరుగుతాయి. కాబట్టి శ్వాస సంబంధ సమస్యలు లేక తత్సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ల మీద ప్రతిచర్య చూపే ఘాటైన సెంట్లు, అత్తర్లు పరిమితంగా వాడితే వారిపట్ల దయ చూపించినవాళ్లమౌతాం.—1 కొరిం. 10:24.

▪ ప్లీజ్‌ ఫాలో అప్‌ (S-43) ఫారమ్‌లు: సమావేశ సమయంలో మనం అనియత సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆసక్తి చూపించినవాళ్ల సమాచారం అందించడానికి ప్లీజ్‌ ఫాలో అప్‌ ఫారమ్‌ను ఉపయోగించాలి. ప్రచారకులు సమావేశానికి ఒకటి లేదా రెండు ఫారాలను తెచ్చుకోవాలి. పూర్తి చేయబడిన ఫారాలను పుస్తక విభాగానికి లేదా మీరు తిరిగి వెళ్లిన తర్వాత మీ సంఘ కార్యదర్శికి ఇవ్వవచ్చు.—నవంబరు 2009 మన రాజ్య పరిచర్యలోని, 3వ పేజీ చూడండి.

▪ రెస్టారెంట్లు: రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు మీ మంచి ప్రవర్తన ద్వారా యెహోవా నామాన్ని ఘనపర్చండి. టిప్‌ ఇవ్వడం అక్కడ సాధారణమైతే ఇవ్వండి.

▪ హోటళ్లు:

(1) అవసరమయ్యే దానికన్నా ఎక్కువ రూములు రిజర్వు చేసుకోకండి, మీ రూములో అనుమతించిన దానికన్నా ఎక్కువమందిని ఉంచుకోకండి.

(2) అత్యవసర పరిస్థితుల్లో తప్ప మీ రూము రిజర్వేషన్‌ను రద్దు చేయకండి, ఒకవేళ రద్దు చేయాల్సివస్తే హోటల్‌ సిబ్బందికి వెంటనే తెలియజేయండి.—మత్త. 5:37.

(3) మీరు మీ బ్యాగులన్నీ సర్దుకున్నాకే లగేజీ కార్ట్‌ తెచ్చుకోండి, ఇతరులకు కూడా అది అవసరమవుతుంది కాబట్టి వెంటనే దానిని తిరిగి ఇచ్చేయండి.

(4) వంట చేసేందుకు అనుమతిలేని రూములో వంట చేయకండి.

(5) మీ లగేజీ మోసే వాళ్లకు, ప్రతీరోజు మీ రూము శుభ్రం చేసే వాళ్లకు టిప్‌ ఇవ్వండి.

(6) అతిథులు హోటళ్లలో ఉన్నప్పుడు వారికి అందించబడే అల్పాహారం, కాఫీ లేదా ఐస్‌లాంటి అదనపు ఏర్పాట్లను దుర్వినియోగం చేయకండి.

(7) హోటల్‌ సిబ్బందితో వ్యవహరిస్తున్నప్పుడు అన్నిసమయాల్లో ఆత్మఫలాన్ని ప్రదర్శించండి. వాళ్లు హోటల్‌కు వచ్చే చాలామందిని చూసుకోవాలి కాబట్టి వాళ్లపట్ల మనం దయ, ఓర్పు, సహేతుకత చూపిస్తే ఎంతో సంతోషిస్తారు.

(8) ట్యాక్స్‌ కలపకుండా రూము అద్దె ఒక రోజుకు ఎంత అవుతుందో సిఫారసు చేయబడిన హోటళ్ల జాబితాలో ఇవ్వబడింది. మీరు కోరని లేదా ఉపయోగించని వాటి కోసం అదనంగా బిల్లు కట్టమని అడిగితే ఒప్పుకోకండి, వీలైనంత త్వరగా రూమింగ్‌ విభాగానికి తెలియజేయండి.

(9) మీ హోటల్‌ రూముకు సంబంధించి ఏదైనా సమస్య ఎదురైతే, సమావేశం వద్ద ఉన్నప్పుడే రూమింగ్‌ విభాగానికి తెలియజేయండి.

(10) హోటల్‌లో దిగినప్పుడు మీరు డెబిట్‌ కార్డుగానీ క్రెడిట్‌ కార్డుగానీ ఉపయోగిస్తే మీ రూముకు కట్టాల్సిన మొత్తం డబ్బుతో పాటు మీరు అక్కడ ఉన్నప్పుడు ఏమైనా పాడుచేస్తే వాటి కోసం మీ అకౌంటులో నుండి సరిపడా డబ్బును వాళ్ల దగ్గర నిలిపివుంచుకోవడం పరిపాటి. మీరు హోటల్‌ను ఖాళీ చేసిన తర్వాత మీ అకౌంటు సెటిలయ్యే కొన్ని రోజుల వరకు మీరు ఆ డబ్బును ఉపయోగించుకోలేరు.

▪ స్వచ్ఛంద సేవ: సమావేశ స్థలంలో, సమావేశానికి సంబంధించి ఏదైనా పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వెళ్తే, సమావేశానికి హాజరైనందుకు పొందిన ఆనందం రెట్టింపవుతుంది. (అపొ. 20:35) అలా సహాయం చేయాలనుకున్న వాళ్లెవరైనా సమావేశంలోని స్వచ్ఛంద సేవా విభాగం దగ్గరకు వెళ్లి చెప్పాలి. 16 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలు కూడా అలా సహాయం చేయాలనుకుంటే వాళ్లు తల్లిదండ్రుల పర్యవేక్షణలో గానీ లేదా వాళ్ల అనుమతి పొందిన ఇతర పెద్దవాళ్ల పర్యవేక్షణలో గానీ చేయవచ్చు.

[5వ పేజీలోని బాక్సు]

ఆహ్వాన పత్రాన్ని ఎలా ఇస్తాం?

మన క్షేత్రంలో ఎక్కువమందిని ఆహ్వానించాలంటే క్లుప్తంగా మాట్లాడాలి. మనం ఇలా అనవచ్చు: “నమస్తే. ఈ ఆహ్వాన పత్రాన్ని అందించే ప్రపంచవ్యాప్త పనిలో మేము భాగంవహిస్తున్నాం. ఇది మీకోసం. మరిన్ని వివరాలు ఈ ఆహ్వాన పత్రంలో ఉన్నాయి.” ఈ ఆహ్వాన పత్రం ప్రజల ఆసక్తిని చూరగొనే విధంగా తయారుచేయబడింది కాబట్టి గృహస్థునికి ముఖ పేజీ కనిపించే విధంగా దాన్ని ఇవ్వండి. ఉత్సాహం చూపించండి. వారాంతాల్లో దాన్ని ఇస్తున్నప్పుడు తగిన చోట పత్రికలు కూడా ఇవ్వాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి