ఫిబ్రవరి 25తో మొదలయ్యే వారపు పట్టిక
ఫిబ్రవరి 25తో మొదలయ్యే వారం
పాట 15, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 8వ అధ్యా., 1-8 పేరాలు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: మార్కు 5-8 (10 నిమి.)
వపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: “మీరు ఆపేయాలా?” చర్చ.
10 నిమి: ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2013, పుస్తకం నుండి ప్రయోజనం పొందండి. చర్చ. 3, 4 పేజీల్లో ఉన్న వార్షిక వచనాన్ని, 5వ పేజీలో ఉన్న “ఈ చిన్న పుస్తకాన్ని ఎలా ఉపయోగించాలి?” అనే భాగాన్ని క్లుప్తంగా పరిశీలించండి. తర్వాత, సాధారణంగా దినవచనం ఎప్పుడు చదువుతారో, దానివల్ల ఎలా ప్రయోజనం పొందుతున్నారో చెప్పమని ప్రేక్షకులను అడగండి. ప్రతీరోజు దినవచనం పరిశీలించమని అందర్నీ ప్రోత్సహిస్తూ ముగించండి.
15 నిమి: “అపార్ట్మెంట్లలో ప్రకటిస్తూ సమగ్రంగా సాక్ష్యమివ్వండి.” 1-11 పేరాలను ప్రశ్నాజవాబుల రూపంలో ఒక సంఘ పెద్ద చర్చిస్తాడు. ఇందులోని సమాచారాన్ని స్థానిక పరిస్థితులకు సరిపోయేలా అన్వయించండి.
పాట 44, ప్రార్థన