దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2013 ఫిబ్రవరి 25తో మొదలయ్యే వారంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం. ప్రతీ ప్రశ్న చివర్లో, దాన్ని చర్చించబోయే తేదీ ఉంది. మీరు ప్రతీ వారం పాఠశాలకు సిద్ధపడేటప్పుడు దాని గురించి కూడా పరిశోధన చేయవచ్చు.
1. “దుఃఖపడువారు ధన్యులు” అని యేసు ఎందుకు అన్నాడు? (మత్త. 5:4) [జన. 7, w09 2/15 6వ పేజీ, 6వ పేరా]
2. యేసు తన శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో చెబుతూ ‘మమ్మును శోధనలోకి తేవద్దు’ అని వేడుకోమని ఎందుకు చెప్పాడు? (మత్త. 6:13) [జన. 7, w04 2/1 16వ పేజీ, 13వ పేరా]
3. యేసు శిష్యులు ఇతరులను క్షమించడం ద్వారా ఇతరులు కూడా ఏమి చేసేలా పురికొల్పుతారు? (మత్త. 7:1, 2) [జన. 14, w08 5/15 9వ పేజీ, 14వ పేరా]
4. ఆవగింజ ఉపమానంలో యేసు ఏ రెండు విషయాలు నొక్కిచెప్పాడు? (మత్త. 13:31, 32) [జన. 21, w08 7/15 17-18 పేజీలు, 3-8 పేరాలు]
5. “మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరు” అనే మాటల్లో యేసు ఏ పాఠం నేర్పాడు? (మత్త. 18:3) [జన. 28, w07 2/1 9వ పేజీ, 3-4 పేరాలు]
6. యూదా ఏ భావంలో పశ్చాత్తాపపడ్డాడు? (మత్త. 27:3-5) [ఫిబ్ర. 11, w08 1/15 31వ పేజీ, 3వ పేరా]
7. యేసు “విశ్రాంతిదినమునకును ప్రభువు” అని ఎందుకు పిలువబడ్డాడు? (మార్కు 2:28) [ఫిబ్ర. 18, w08 2/15 28వ పేజీ, 7వ పేరా]
8. యేసు తన తల్లి గురించి, సహోదరుల గురించి ఎందుకలా మాట్లాడాడు, దీని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (మార్కు 3:31-35) [ఫిబ్ర. 18, w08 2/15 29వ పేజీ, 5వ పేరా]
9. మార్కు 8:22-25లోని వృత్తాంతం చెబుతున్నట్లు, యేసు గుడ్డివాని చూపును రెండు దఫాలలో ఎందుకు తెప్పించివుంటాడు, దీని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? [ఫిబ్ర. 25, w00 2/15 17వ పేజీ, 7వ పేరా]
10. మార్కు 8:32-34 వచనాల్లో పేతురు పలికిన మాటలకు యేసు స్పందించిన తీరు నుండి మనం ఏమి నేర్చుకుంటాం? [ఫిబ్ర. 25, w08 2/15 29వ పేజీ, 6వ పేరా]