డిసెంబరు 24తో మొదలయ్యే వారపు పట్టిక
డిసెంబరు 24తో మొదలయ్యే వారం
పాట 1, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 5వ అధ్యా., 1-8 పేరాలు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: జెకర్యా 9-14 (10 నిమి.)
నం. 1: జెకర్యా 11:1-13 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: భవిష్యత్తులో అద్భుతమైన స్వాతంత్ర్యముంది —wt 188-191 పేజీలు, 11-15 పేరాలు (5 నిమి.)
నం. 3: సామెతలు 15:1 మనకు ఏ పరిస్థితుల్లో సహాయం చేస్తుంది? (5 నిమి.)
❑ సేవా కూటం:
30 నిమి: మన అధికారిక వెబ్సైట్ను చక్కగా ఎలా ఉపయోగించుకోవచ్చు? 3-6 పేజీల ఆధారంగా చర్చ. 4వ పేజీని పరిశీలిస్తున్నప్పుడు మూడు నిమిషాల ప్రదర్శన చేయించండి. దానిలో ఒక కుటుంబం అప్పుడే తమ కుటుంబ ఆరాధనను ముగిస్తుంది, తర్వాతి వారం ఏయే విషయాలను చర్చిస్తే బాగుంటుందని కుటుంబ శిరస్సు అడుగుతాడు. అప్పుడు పిల్లలు మన వెబ్సైట్లోని “టీనేజర్స్” అనే సెక్షన్లో ఉన్న కొన్ని విషయాలు చర్చిద్దామని అంటారు. తర్వాత, కుటుంబ లేదా వ్యక్తిగత అధ్యయనం కోసం jw.org వెబ్సైట్ను ఎలా ఉపయోగించారో లేదా ముందుముందు ఎలా ఉపయోగించాలనుకుంటున్నారో చెప్పమని ప్రేక్షకులను అడగండి. 5వ పేజీని చర్చిస్తున్నప్పుడు, మన నమ్మకాల గురించి ఇంటివాళ్లు అడిగిన ప్రశ్నకు ఒక ప్రచారకుడు తన ఫోన్లో మన వెబ్సైట్తెరిచి జవాబిస్తున్నట్లు మూడు నిమిషాల ప్రదర్శన చేయించండి. 6వ పేజీని పరిశీలిస్తున్నప్పుడు, మన సాహిత్యాన్ని వేరే భాషలో చదవాలనుకునే ఆసక్తిపరునితో ఒక ప్రచారకుడు మాట్లాడుతున్నట్లు నాలుగు నిమిషాల ప్రదర్శన చేయించండి. ప్రచారకుడు గృహస్థుని భాషలో మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రాన్ని లేదా బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకాన్ని తన ఫోన్లో లేదా గృహస్థుని కంప్యూటర్లో తెరిచి చూపించి, ఆయనతో చర్చిస్తాడు. పరిచర్యలో jw.orgను ఎలా ఉపయోగించారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 10, ప్రార్థన