ఆగస్టు 6తో మొదలయ్యే వారపు పట్టిక
ఆగస్టు 6తో మొదలయ్యే వారం
పాట 40, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 116వ అధ్యాయం “వెళ్లిపోవుటకు ముందు మరింత ఉపదేశము” అనే ఉపశీర్షిక నుండి. (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెహెజ్కేలు 24-27 (10 నిమి.)
నం. 1: యెహెజ్కేలు 24:15-27 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ ధైర్యంగా ప్రకటించండి —wt 167-168 పేజీలు, 1-3 పేరాలు (5 నిమి.)
నం. 3: యెహెజ్కేలు 18:20, నిర్గమకాండము 20:5 ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయా? (5 నిమి.)
❑ సేవాకూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: మీరు విద్యా సంవత్సరానికి సిద్ధంగా ఉన్నారా? చర్చ. క్రైస్తవ యౌవనులు పాఠశాలలో ఎదుర్కొనే కొన్ని సవాళ్ళ గురించి చెప్పమని ప్రేక్షకులను అడగండి. శోధనలను ఎదిరించేలా, తమ విశ్వాసాన్ని సమర్థించుకునేలా పిల్లల్ని సిద్ధం చేయడానికి తల్లిదండ్రులు కుటుంబ ఆరాధన సమయంలో మన ప్రచురణలను ఎలా ఉపయోగించవచ్చో వివరించండి. (1 పేతు. 3:15) ఒకటి లేదా రెండు అంశాలను ఎంపిక చేసుకొని, మన ప్రచురణల్లో నుండి సహాయకరంగా ఉండే కొంత సమాచారాన్ని చెప్పండి. పాఠశాలలో ఉన్నప్పుడు ఎలా సాక్ష్యమివ్వగలిగారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
15 నిమి: స్థానిక అవసరాలు.
5 నిమి: ఆగస్టులో పత్రిక ఇవ్వడానికి సలహాలు. చర్చ. మీ ప్రాంతంలోని ప్రజలకు కావలికోట తాజా సంచిక ఎందుకు ఆసక్తికరంగా ఉంటుందో చెప్పడానికి 30 నుండి 60 సెకండ్లు తీసుకోండి. ఆ తర్వాత ఆసక్తి రేకెత్తించే ఏ ప్రశ్న వేస్తే బాగుంటుందో, ఏ లేఖనం చదివితే బాగుంటుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రిక ఎలా ఇవ్వవచ్చో ప్రదర్శింపజేయండి.
పాట 17, ప్రార్థన