కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/12 పేజీ 8
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2012
మన రాజ్య పరిచర్య—2012
km 7/12 పేజీ 8

ప్రకటనలు

◼ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? జూలై, ఆగస్టు: సంఘానికి అందుబాటులో ఉన్న 32 పేజీల ఏ బ్రోషుర్‌నైనా ఉపయోగించండి. పునర్దర్శనాలు చేస్తున్నప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని లేదా గృహస్థుల పరిస్థితిని బట్టి దేవుడు చెప్పేది వినండి బ్రోషుర్‌నైనా, దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి బ్రోషుర్‌నైనా ఇచ్చి బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించండి. సెప్టెంబరు, అక్టోబరు: కావలికోట పత్రిక. పునర్దర్శనాలు చేస్తున్నప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని పరిచయం చేయండి. లేదా గృహస్థుల పరిస్థితిని బట్టి, దేవుడు చెప్పేది వినండి బ్రోషుర్‌నైనా, దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి బ్రోషుర్‌నైనా ఇవ్వడం మరింత సబబుగా ఉంటుందనుకుంటే అది ఇచ్చి బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి ప్రయత్నించండి.

◼ యెహోవాకు కీర్తనలు పాడదాం​—⁠వాద్య బృందగానం, 5వ డిస్క్‌ విడుదలవుతుంది, అది ఆగస్టు 1 నుండి jw.org వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. మొదట అది ఆంగ్లంలో లభ్యమవుతుంది, ఆ తర్వాత కొంతకాలానికి ఇతర భాషల్లో లభ్యమవుతుంది. ఆడియో సీడీలను మీ సంఘం ద్వారా రిక్వెస్టు చేయవచ్చు. డిస్కులను తయారుచేసి, పంపించడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే ఇంటర్నెట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పుడయ్యే ఖర్చు తక్కువ. ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్నవాళ్ళను డౌన్‌లోడ్‌ చేసుకోమని ప్రోత్సహిస్తున్నాం. 1-4 డిస్క్‌లు ఇప్పటికే విడుదల అయ్యాయి.

◼ సమావేశానికి సంబంధించిన సలహాలు, జ్ఞాపికలు పరిశీలించడం కోసం మీ జిల్లా సమావేశానికి ముందు వారంలో జరిగే కూటాలు అవసరమైతే సర్దుబాటు చేసుకోవచ్చు. సమావేశం అయిన ఒకటి లేదా రెండు నెలల తర్వాత, పరిచర్యలో ప్రచారకులకు సహాయకరంగా అనిపించిన సమావేశ అంశాలను పరిశీలించడం కోసం స్థానిక అవసరాలు చర్చించే సమయాన్ని ఉపయోగించవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి