రెండు చిన్న కాసులు
రాజ్య సంబంధ విషయాలకు మద్దతును ఇవ్వడానికున్న ముఖ్యమైన పద్ధతుల్లో ఒకటి, ప్రపంచవ్యాప్త ప్రకటనా పని కోసం విరాళాలివ్వడం. కానీ మన దగ్గర అంతగా డబ్బు లేకపోతే అప్పుడెలా?
ఒకసారి, ఓ బీద విధవరాలు చాలా తక్కువ విలువ ఉన్న రెండు కాసులు కానుక పెట్టెలో వేయడం యేసు చూశాడు. యెహోవా పట్ల ప్రేమ ఉండడం వల్లే ఆమె, ‘తన లేమిలో తనకు కలిగినదంతా, అంటే తన జీవనమంతా వేసింది.’ (మార్కు 12:41-44) యేసు చెప్పిన మాటల్ని బట్టి, ఆమె విరాళం దేవుని దృష్టిలో ఎంతో విలువైనదని అర్థమౌతోంది. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు కూడా పరిచర్యకు ఆర్థిక మద్దతు ఇవ్వడాన్ని ఒక గొప్ప గౌరవంగా భావించారు. పేదలు, ధనికులు అని తేడా లేకుండా క్రైస్తవులందరూ తాము ఇవ్వగలిగింది ఇచ్చారు. అపొస్తలుడైన పౌలు మాసిదోనియలోని సహోదరుల గురించి ఇలా రాశాడు: ‘వాళ్లు చాలా పేదరికం అనుభవించినా, విశ్వాసులకు చేసే సహాయంలో తాము కూడా చేరతామని ప్రాధేయపడ్డారు.’—2 కొరిం. 8:1-4, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్.
కాబట్టి, మనం విరాళంగా ‘రెండు కాసులనే’ ఇచ్చినా, అలాంటి చిన్నచిన్న విరాళాలే ఒక పెద్ద మొత్తం అవుతాయని గుర్తుంచుకోండి. ‘దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాళ్లను ప్రేమిస్తాడు.’ కాబట్టి మనం హృదయపూర్వకంగా ఇస్తే, సమృద్ధిగా ఇచ్చే మన పరలోక తండ్రిని సంతోషపెడతాం.—2 కొరిం. 9:7.