దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2012 ఏప్రిల్ 30తో మొదలయ్యే వారంలోని దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం. ప్రతీవారం పాఠశాలకు సిద్ధపడుతున్నప్పుడు పరిశోధన చేసేందుకు వీలుగా ప్రతీ ప్రశ్న పక్కన అది చర్చించబడే తేదీ ఇవ్వబడింది.
1. బైబిల్లోని యిర్మీయా పుస్తకం వల్ల మనకెలాంటి ప్రయోజనముంది? [మార్చి 5, w07 3/15 8వ పేజీ, 2వ పేరా]
2. నేటి హింస నుండి యెహోవా మనల్ని ఎలా విడిపించవచ్చు? (యిర్మీ. 1:8) [మార్చి 5, w05 12/15 23వ పేజీ, 18వ పేరా]
3. అభిషిక్తులు ఎప్పుడు, ఎలా ‘పురాతన మార్గములకు’ తిరిగివచ్చారు? (యిర్మీ. 6:16) [మార్చి 12, w05 11/1 24వ పేజీ, 12వ పేరా]
4. నేడు ‘గిలాదు గుగ్గిలం’ ఉందని ఎందుకు చెప్పవచ్చు? (యిర్మీ. 8:22) [మార్చి 19, w10 10/1 26వ పేజీ, 3వ పేరా–27వ పేజీ, 4వ పేరా]
5. యెహోవా ‘చాలామంది జాలరులను, అనేకులైన వేటగాండ్రను పిలిపించడం’ దేన్ని సూచిస్తుంది? (యిర్మీ. 16:16) [మార్చి 26, w07 3/15 9వ పేజీ, 5వ పేరా]
6. యెహోవా ఏ విధంగా యిర్మీయాపై తన ‘బలాన్ని ఉపయోగించి ఆయనను భ్రమలోపడేలా చేశాడు’? (యిర్మీ. 20:7, NW) [ఏప్రి. 2, w07 3/15 9వ పేజీ, 6వ పేరా]
7. “యెహోవా భారము” అంటే ఏమిటి? (యిర్మీ. 23:33) [ఏప్రి. 9, w07 3/15 11వ పేజీ, 1వ పేరా]
8. యెహోవా ధర్మవిధి హృదయాలమీద ఎలా రాయబడింది? (యిర్మీ. 31:33) [ఏప్రి. 23, w07 3/15 11వ పేజీ, 2వ పేరా]
9. ఒకే ఒడంబడికకు సంబంధించిన రెండు క్రయపత్రాలు తయారుచేయడం యొక్క సంకల్పమేమిటి? (యిర్మీ. 32:10-15) [ఏప్రి. 30, w07 3/15 11వ పేజీ, 3వ పేరా]
10. యిర్మీయా 33:23, 24లో ప్రస్తావించబడిన “రెండు కుటుంబములు” ఏవి? [ఏప్రి. 30, w07 3/15 11వ పేజీ, 4వ పేరా]