మార్చి 26తో మొదలయ్యే వారపు పట్టిక
మార్చి 26తో మొదలయ్యే వారం
పాట 1, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 87వ అధ్యాయం (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యిర్మీయా 12-16 (10 నిమి.)
నం. 1: యిర్మీయా 13:1-14 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: ప్రభువు రాత్రి భోజనంలో ఎవరు భాగం వహించాలి? (5 నిమి.)
నం. 3: జ్ఞాపకార్థ ఆచరణ ఎంత తరచుగా ఆచరించాలి? ఎప్పుడు ఆచరించాలి? (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు. ఇంకా ఎన్ని ప్రాంతాల్లో జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రాలు అందించాలో సంఘానికి తెలియజేయండి.
10 నిమి: ఆతిథ్యం ఇవ్వడం మరచిపోకండి. (హెబ్రీ. 13:1, 2) పెద్ద ఇచ్చే ప్రసంగం. జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన స్థానిక ఏర్పాట్ల గురించి చెప్పండి. జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన కొత్తవాళ్లను, నిష్క్రియులైన ప్రచారకులను ప్రేమతో ఎలా ఆహ్వానించాలో చెప్పండి. రెండు భాగాలున్న ఒక క్లుప్త ప్రదర్శన చేయించండి. మొదటి భాగంలో, మన ఆహ్వాన పత్రాన్ని అందుకుని వచ్చిన ఒక వ్యక్తిని కూటానికి ముందు ఒక ప్రచారకుడు పలకరిస్తున్నట్లు చూపించండి. రెండవ భాగంలో, అదే ప్రచారకుడు కూటం అయిన తర్వాత అతని ఆసక్తిని రేకెత్తించడానికి తిరిగి కలుసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు చూపించండి.
20 నిమి: మీ పిల్లలకు యెహోవాను ప్రేమించడం నేర్పించండి—అధ్యయన అలవాట్లు. కావలికోట సెప్టెంబరు 1, 2007, 27-28 పేజీల్లోని 8-12 పేరాల ఆధారంగా జరిగే చర్చ.
పాట 15, ప్రార్థన