నవంబరు 28తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
నవంబరు 28తో మొదలయ్యే వారం
పాట 29, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 54, 55 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: పరమగీతము 1-8 (10 నిమి.)
నం. 1: పరమగీతము 1:1-17 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేవుని రాజ్యం సాధించేవి—ఇప్పుడు, వెయ్యేండ్లలో—wt 98-100 పేజీలు, 15-17 పేరాలు (5 నిమి.)
నం. 3: ఇతరులు మనల్ని గౌరవించాలంటే మనం ఏమిచేయాలి? (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: ప్రకటనలు. డిసెంబరు నెలలో మొదటి శనివారం బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి 4వ పేజీలో ఉన్న నమూనా అందింపును ఎలా ఉపయోగించవచ్చో ప్రదర్శించండి. ఆ రోజు పరిచర్యలో పాల్గొనమని అందరినీ ప్రోత్సహించండి.
15 నిమి: “మంచి బోధకునికి ఉండాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన లక్షణం.” ప్రశ్నాజవాబులు. ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి తమకు బైబిలు బోధించిన వాళ్లు చూపించిన ప్రేమ ఎలా దోహదపడిందో అనుభవాలు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
10 నిమి: డిసెంబరులో పత్రికను అందించడానికి సూచనలు. చర్చ. మీ ప్రాంతంలోని ప్రజలకు ఆసక్తికరంగా ఉండే శీర్షికల గురించి చెప్పడానికి ఒకటి లేదా రెండు నిమిషాలు కేటాయించండి. పత్రిక ఎలా అందించాలో ప్రదర్శించండి.
పాట 18, ప్రార్థన