కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/11 పేజీ 2
  • ప్రశ్నాభాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నాభాగం
  • మన రాజ్య పరిచర్య—2011
  • ఇలాంటి మరితర సమాచారం
  • సేవచేయడానికి “గొప్ప ద్వారము తెరువబడియున్నది”
    మన రాజ్య పరిచర్య—2014
  • దయచేసి సకాలంలో సందర్శించండి
    మన రాజ్య పరిచర్య—2003
  • ప్రశ్నాభాగం
    మన రాజ్య పరిచర్య—2015
  • బ్రాంచి కార్యాలయం ఏమేం చేస్తుంది?
    నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు చేస్తున్నారు?
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2011
km 11/11 పేజీ 2

ప్రశ్నాభాగం

◼ కూపన్లను, ఇంటర్నెట్‌ రిక్వెస్టులను ఎవరు ఉపయోగించాలి?

మన ప్రచురణల్లో తరచుగా కూపన్లు వస్తుంటాయి; సాహిత్యాన్ని లేదా యెహోవాసాక్షులను పంపించమని కోరడానికి వాటిని నింపి బ్రాంచి కార్యాలయానికి పంపింస్తుంటారు. అంతేగాక www.watchtower.org వెబ్‌సైట్‌లో కూడా బైబిలు అధ్యయనాల కోసం రిక్వెస్టు చేయవచ్చు. ఈ ఏర్పాట్ల వల్ల చాలామంది సత్యం నేర్చుకోగలిగారు. అయితే ప్రచారకులు ఈ ఏర్పాట్లను ఉపయోగించి తమ బంధువులకు, మరితరులకు ఆధ్యాత్మిక సహాయం చేయాలని ప్రయత్నించినప్పుడు సమస్యలు తలెత్తాయి.

తాము విజ్ఞప్తి చేయకుండానే బ్రాంచి కార్యాలయం నుండి సాహిత్యాలను అందుకున్న కొందరు, సంస్థ తమను వేధిస్తుందంటూ, తమ చిరునామాలను సంస్థ తపాలా జాబితాలో ఉంచుకుందంటూ ఫిర్యాదు చేశారు. అలాగే తమకు అందిన విజ్ఞప్తి పత్రాన్ని బట్టి ఆసక్తి గలవాళ్లను కలుసుకోవాలని వెళ్లిన ప్రచారకులకు కొన్నిసార్లు చేదు అనుభవం ఎదురైంది. అడక్కుండానే తమ దగ్గరకు వచ్చినందుకు ఇంటివాళ్లు చిరాకుపడినప్పుడు మన సహోదరులు చాలా ఇబ్బందిపడ్డారు. కాబట్టి మన వెబ్‌సైట్‌ ద్వారా లేదా కూపన్ల ద్వారా ఆసక్తి గలవాళ్లే రిక్వెస్టు చేయాలి, అంతేకానీ ఇతరుల తరఫున ప్రచారకులు ఆ పని చేయకూడదు. ప్రచారకులు పంపిన విజ్ఞప్తులు ఇతరుల తరఫున వచ్చినవి అని తేలితే బ్రాంచి కార్యాలయం వాటిని పట్టించుకోదు.

మరి మన బంధువులకు, తెలిసినవాళ్లకు ఎలా ఆధ్యాత్మిక సహాయం చేయవచ్చు? వాళ్లకు సాహిత్యాలు అందాలని మీరు కోరుకుంటే, మీరే వాటిని ఒక బహుమానంగా ఎందుకు పంపించకూడదు? వాళ్లకు ఆసక్తి ఉండి, సాక్షులు వచ్చి తమను కలవాలని ఇష్టపడితే అప్పుడెలా? ఈ విషయం వాళ్ల దగ్గర్లో ఉన్న సంఘంలోని పెద్దలకు ఎలా తెలియజేయాలో మీకు తెలియకపోతే ప్లీజ్‌ ఫాలో అప్‌ (S-43) ఫారమ్‌ను నింపి మీ సంఘ కార్యదర్శికి ఇవ్వండి. ఆయన దాన్ని పరిశీలించి బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాడు. ఒకవేళ ఆసక్తి చూపించిన వ్యక్తి జైల్లో లేదా మాదకద్రవ్యాలకు బానిసలైనవారి పునరావాస కేంద్రంలో ఉంటే వాళ్ల తరఫున మీరు బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించకూడదు. బదులుగా వాటిని సందర్శించే సహోదరులతో మాట్లాడమని లేదా బ్రాంచి కార్యాలయానికి స్వయంగా ఉత్తరం రాయమని ప్రోత్సహించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి