ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
సెప్టెంబరులో మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి:
వినడానికి ఇష్టపడే గృహస్థుణ్ణి మీరిలా అడగవచ్చు: “చాలామంది యేసు ఒక మంచి వ్యక్తి అని ఆయనను గౌరవిస్తారు, నిజానికి ఆయన ఎవరని మీరనుకుంటున్నారు? [వాళ్లేమి చెప్తారో వినండి.] యేసు ఉనికి గురించి చెప్పే ఒక లేఖనం చూపించమంటారా?” గృహస్థుడు ఆసక్తి చూపిస్తే కొలొస్సయులు 1:15, 16 చదవండి. తర్వాత జూలై - సెప్టెంబరు కావలికోట పత్రికను ఆయన చేతికిచ్చి, 28వ పేజీలోని మొదటి ఉపశీర్షిక కింద ఉన్న సమాచారం కలిసి చర్చించండి. ఆయనకు పత్రిక ఇచ్చి, తర్వాతి ప్రశ్న చర్చించేందుకు ఏర్పాటు చేసుకోండి.
కావలికోట జూలై - సెప్టెంబరు
“ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో జూదం ఎంతో ప్రజాదరణ పొందింది. జూదం గురించి మీరేమనుకుంటున్నారు? [వాళ్లేమి చెప్తారో వినండి.] ఈ విషయంలో మనకు సహాయం చేసే ఒక సూత్రాన్ని చూపించమంటారా? [గృహస్థుడు ఆసక్తి చూపిస్తే నిర్గమకాండము 20:17 చదవండి.] జూదం గురించి బైబిలు ఏమి చెబుతుందో ఈ ఆర్టికల్ చర్చిస్తుంది.” 30వ పేజీలోని ఆర్టికల్ చూపించండి.