ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
సెప్టెంబరులో మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి:
“ప్రతీ ఒక్కరికీ స్నేహితులు అవసరమని మీరు అంగీకరిస్తారు. ఒక స్నేహితునిలో ఏ లక్షణం ఉండడం ప్రాముఖ్యమని మీరు అనుకుంటారు? [వాళ్ళేమి చెబుతారో వినండి.] మనం స్నేహితులను ఎందుకు జాగ్రత్తగా ఎంచుకోవాలో తెలియజేసే కొన్ని లేఖన సూత్రాలను మీకు చూపించమంటారా?” గృహస్థుడు ఆసక్తి చూపిస్తే కావలికోట జూలై-సెప్టెంబరు ప్రతి ఒకటి చేతికిచ్చి, 18వ పేజీలోని మొదటి ఉపశీర్షిక కిందవున్న సమాచారాన్ని చదివి, చర్చించండి. గృహస్థుడు ఒప్పుకుంటే దానిలోని కనీసం ఒక లేఖనాన్ని చదవండి. ఆ పత్రికను ఉంచుకోవచ్చని చెప్పి, తర్వాతి ప్రశ్నకు జవాబు పరిశీలించడానికి తిరిగి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోండి.