ప్రకటనలు
▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? ఆగస్టు: మీ ప్రాంతంలోని ప్రజలకు ఆసక్తికరంగా ఉండే, మీ భాషలో అందుబాటులో ఉన్న 32 పేజీల బ్రోషుర్ ఏదైనా ఇవ్వవచ్చు. సెప్టెంబరు: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? మొదటిసారి కలిసినప్పుడే బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి ప్రయత్నించండి. గృహస్థుల దగ్గర ఈ పుస్తకం అప్పటికే ఉంటే, వాళ్లు బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడకపోతే వాళ్లకు ఆసక్తివున్న అంశం గురించి తెలియజేసే ఏ పాత పత్రికైనా బ్రోషురైనా ఇవ్వవచ్చు. అక్టోబరు: కావలికోట పత్రిక. ఆసక్తివున్న వాళ్లకు మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రం ఇచ్చి బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి కృషిచేయండి. నవంబరు: బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది అనే బ్రోషుర్‌తోపాటు లేదా దీనికి బదులు మీ ప్రాంతంలోని ప్రజలకు ఆసక్తికరంగా ఉండే, మీ భాషలో అందుబాటులో ఉన్న 32 పేజీల బ్రోషుర్ ఏదైనా ఇవ్వవచ్చు.
▪ అందుబాటులోవున్న కొత్త ప్రచురణలు:
యెహోవాకు కీర్తనలు పాడదాం—పదకూర్పు మాత్రమే (55 పాటలు) —మరాఠి
దేవుని ప్రేమలో నిలిచి ఉండండి —నేపాలీ
బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది —ఒరియా
▪ మళ్లీ లభ్యమయ్యే ప్రచురణలు:
దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? —ఒరియా, ఖాసీ