కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/12 పేజీ 3
  • మీ పిల్లలు సిద్ధంగా ఉన్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ పిల్లలు సిద్ధంగా ఉన్నారా?
  • మన రాజ్య పరిచర్య—2012
  • ఇలాంటి మరితర సమాచారం
  • సవాళ్లను అధిగమించేందుకు మీ పిల్లలకు సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • స్కూల్లో సాక్ష్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా?
    మన రాజ్య పరిచర్య—2010
  • పాఠశాలలో మీ పిల్లలు స్థిరంగా ఉంటున్నారా?
    మన రాజ్య పరిచర్య—1990
  • పిల్లలు “యెహోవా ఇచ్చే ఆస్తి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2012
km 5/12 పేజీ 3

మీ పిల్లలు సిద్ధంగా ఉన్నారా?

1. స్కూలు పిల్లలు ఎందుకు సిద్ధంగా ఉండాలి?

1 త్వరలోనే కొత్త విద్యా సంవత్సరం మొదలౌతుంది. మీ పిల్లలకు కొత్తకొత్త సవాళ్లు, ఒత్తిళ్లు ఎదురౌతాయి. అయితే అదే సమయంలో, ‘సత్యమును గురించి సాక్ష్యమివ్వడానికి’ ఎన్నో అవకాశాలు కూడా వాళ్లకు దొరుకుతాయి. (యోహా. 18:37) మరి, మీ పిల్లలు దానికి సిద్ధంగా ఉన్నారా?

2. మీ పిల్లలు సిద్ధంగా ఉండాలంటే వాళ్లకు ఏమి తెలియాలి?

2 జాతీయ ఉత్సవాలకు, మతసంబంధమైన వేడుకలకు సంబంధించి స్కూల్లో ఏమేమి చేస్తారో, వాటిలో పాల్గొనడం ఎందుకు తప్పో మీ పిల్లలకు బాగా తెలుసా? ఉన్నత విద్యను అభ్యసించమని, డేటింగ్‌ (అబ్బాయి, అమ్మాయి కలిసి తిరగడం) చేయమని, మద్యాన్నీ మత్తుపదార్థాలనూ తీసుకోమని తోటివారు చేసే ఒత్తిడిని ఎదుర్కోవడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారా? వాళ్లు ఫలానా కార్యకలాపాలు తమ మతానికి విరుద్ధమని చెప్పి ఊరుకుంటారా? లేదా తమ నమ్మకాల గురించి వివరించగలుగుతారా?—1 పేతు. 3:15, 16.

3. పిల్లలను సిద్ధం చేయడానికి తల్లిదండ్రులు కుటుంబ ఆరాధనా సాయంత్రాన్ని ఎలా ఉపయోగించవచ్చు?

3 కుటుంబ ఆరాధనా సాయంత్రాన్ని ఉపయోగించండి: మీ పిల్లలకు సంవత్సరమంతా స్కూల్లో సమస్యలు ఎదురౌతూనే ఉంటాయి. మీరు వాటి గురించి ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉండవచ్చు. అయితే, కొంత శ్రద్ధతీసుకొని స్కూల్లో ఎదురయ్యే సమస్యల గురించి విద్యా సంవత్సరం ఆరంభమయ్యే ముందు చర్చిస్తే వాళ్లు ధైర్యంగా ఉంటారు. దీనికోసం మీరు ఒకట్రెండు కుటుంబ ఆరాధనా సాయంత్రాలను ఉపయోగించగలరేమో ఆలోచించండి. మీ పిల్లలు కొన్ని కారణాలనుబట్టి సెలవుల తర్వాత స్కూలుకు వెళ్లడానికి ఎంతో భయపడుతుండవచ్చు. వాళ్లు వేటి గురించి భయపడుతున్నారో వాళ్లను అడిగి తెలుసుకోవచ్చు. పోయిన సంవత్సరంతో పోలిస్తే, ఇప్పుడు మీ పిల్లలు ఎదిగారు, విషయాలను బాగా అర్థం చేసుకోగలరు. దీన్ని మనసులో ఉంచుకొని మీరు ప్రతీ సంవత్సరం వాళ్లతో చర్చిస్తూ వచ్చిన విషయాలను మళ్లీ ఒకసారి సమీక్షించవచ్చు. (కీర్త. 78:5) మీరు టీచర్‌గా, సలహాదారుగా లేదా తోటి విద్యార్థిగా నటిస్తూ కొన్ని సన్నివేశాలను వాళ్లతో ప్రాక్టీసు చేయవచ్చు. బైబిలు తెరిచి ఎలా జవాబివ్వాలో, చర్చనీయ బైబిలు అంశాలు అనే చిన్న పుస్తకాన్ని, యువత అడిగే ప్రశ్నలు (ఆంగ్లం) పుస్తకాలను ఎలా ఉపయోగించాలో మీ పిల్లలకు నేర్పించండి. ఒక తల్లి, ప్రతీసారి విద్యా సంవత్సరం ప్రారంభంలో, తన పిల్లలు కొత్త టీచర్లను కలిసి తాము యెహోవాసాక్షులమని ఎలా చెప్పాలో ప్రాక్టీసు చేయించేది.—కావలికోట, డిసెంబరు 15, 2010 సంచికలోని 3-5 పేజీలు చూడండి.

4. తెలివైన తల్లిదండ్రులు ఏమి చేస్తారు?

4 ఈ అంత్యదినాల్లో యౌవనులు ఎదుర్కొనే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి, వాటి తీవ్రత పెరుగుతోంది. (2 తిమో. 3:1) అయితే, తెలివైన తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి సమస్యలు ఎదురుకావచ్చో ముందుగా ఊహించి, వాటిని అధిగమించడానికి వాళ్లను సిద్ధం చేస్తారు. (సామె. 22:3) కొత్త విద్యా సంవత్సరం మొదలయ్యే ముందే, మీ పిల్లలను సిద్ధం చేయడానికి శాయశక్తులా కృషిచేయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి