“సమయాన్ని ఎలా లెక్కించాలి?”
మీరు ఎప్పుడైనా అలా అడిగారా? దీని గురించి సంస్థీకరించబడ్డాం పుస్తకం, 86-87 పేజీల్లో సాధారణ నిర్దేశాలు ఉన్నాయి. సెప్టెంబరు 2008 మన రాజ్య పరిచర్య ప్రశ్నాభాగంలో ఉన్నట్టు అప్పుడప్పుడు అదనంగా నిర్దేశాలు ఇవ్వబడతాయి. పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి నిర్దేశాల పెద్ద చిట్టా మనకు ఇవ్వబడలేదు. అందుకే, ఈ విషయంలో పెద్దలుగానీ, వేరేవాళ్లుగానీ అదనంగా నిర్దేశాలు ఇవ్వడం సరైనది కాదు.
సందేహమేదైనా వస్తే, దానికి సంబంధించిన నిర్దేశం ప్రచురణల్లో లేకపోతే, ప్రతీ ప్రచారకుడు ‘ఆ సమయాన్ని పరిచర్యలోనే గడిపానా? పరిచర్యలో భాగం కాని వేరే పనులేమైనా ఆ సమయంలో చేశానా?’ అని పరిశీలించుకోవాలి. ప్రతీనెల క్షేత్ర సేవా రిపోర్టులో మనం రాసేదాన్ని బట్టి మనకు ఆనందం కలగాలే గానీ అది మన మనస్సాక్షి మనల్ని గద్దించేలా ఉండకూడదు. (అపొ. 23:1) పరిచర్యలో మనం గడిపిన సమయాన్ని ఎలా లెక్కించాలన్నది కాదుగానీ, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్నది ముఖ్యం.—హెబ్రీ. 6:11.