దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2011 జూన్ 27తో మొదలయ్యే వారంలో, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం. పాఠశాల పర్యవేక్షకుడు 2011, మే 2 నుండి జూన్ 27 మధ్య వారాల్లోని ప్రసంగాల సమాచారం ఆధారంగా 20 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు.
1. యోబుకు వ్యతిరేకంగా పాపం చేసినవాళ్ల గురించి ప్రార్థించమని యెహోవా ఆయనను అడిగిన దాని నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (యోబు 42:8) [w06 8/15 28వ పేజీ, 13వ పేరా]
2. క్రైస్తవులు నేడు అర్పించే “నీతియుక్తమైన బలులు” ఏవి? (కీర్త. 4:5) [w06 5/15 18వ పేజీ, 9వ పేరా]
3. దావీదు అంతరింద్రియాలు తనను ఎలా సరిదిద్దుతాయి? (కీర్త. 16:7) [w04 12/1 14వ పేజీ, 9వ పేరా]
4. “ఆకాశములు దేవుని మహిమను” ఎలా ‘వివరిస్తున్నాయి’? (కీర్త. 19:1) [w04 10/1 10వ పేజీ, 8వ పేరా]
5. నిరీక్షణకు, ధైర్యానికి మధ్య ఎలాంటి సంబంధం ఉందని కీర్తన 27:14 సూచిస్తుంది? [w06 10/1 26-27 పేజీలు, 3, 6 పేరాలు]
6. తనను ద్వేహించేవాళ్లు కన్ను గీటకుండా చేయమని దావీదు చేసిన విన్నపం భావమేమిటి? [w06 5/15 20వ పేజీ, 2వ పేరా]
7. మెప్పు విషయంలో, చెరలోవున్న ఒక లేవీయుని నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (కీర్త. 42:1-3) [w06 6/1 9వ పేజీ, 3వ పేరా]
8. యెరూషలేము “పరిపూర్ణ సౌందర్యముగలది” అని ఎందుకు పిలువబడుతోంది? (కీర్త. 50:2) [w06 6/1 9వ పేజీ, 2వ పేరా]
9. దావీదు ఎవరి “సమ్మతిగల మనస్సు” మద్దతు కావాలని కోరుకున్నాడు? (కీర్త. 51:12) [w06 6/1 9వ పేజీ, 10వ పేరా]
10. మనం దేవుని మందిరంలో ఒక ఒలీవ చెట్టులా ఎలా ఉండవచ్చు? (కీర్త. 52:8) [w00 5/15 29వ పేజీ, 6వ పేరా]