జూన్ 27తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జూన్ 27తో మొదలయ్యే వారం
పాట 21, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 19వ అధ్యాయం (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: కీర్తనలు 52-59 (10 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: ప్రకటనలు. “సమయాన్ని ఎలా లెక్కించాలి?” పెద్ద ఇచ్చే ప్రసంగం. ప్రసంగం తర్వాత, జూలైలో మొదటి శనివారం బైబిలు అధ్యయనం ఎలా ప్రారంభించవచ్చో నాలుగవ పేజీలో ఉన్న నమూనా అందింపును ఉపయోగించి ఒక ప్రదర్శనలో చూపించండి. బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించమని అందరినీ ప్రోత్సహించండి.
10 నిమి: జూలైలో పత్రిక అందించడానికి సిద్ధపడండి. చర్చ. పత్రికలోని విషయాల గురించి ఒకట్రెండు నిమిషాలు చెప్పండి. తర్వాత రెండుమూడు ఆర్టికల్స్ ఎంపిక చేసుకొని వాటిని ఇవ్వడానికి ఏ ప్రశ్నలు వేస్తే బాగుంటుందో, ఏ లేఖనాలు చూపిస్తే బాగుంటుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రికను ఎలా పరిచయం చేయవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.
15 నిమి: ప్రకటించేటప్పుడు ఔచిత్యాన్ని ప్రదర్శించండి. పరిచర్య పాఠశాల పుస్తకం, 197-199 పేజీల ఆధారంగా చర్చ. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ప్రచారకుడు ఔచిత్యం లేకుండా ప్రతిస్పందిస్తున్నట్లు ఒక ప్రదర్శనలో చూపించండి. ఆ తర్వాత మరో ప్రదర్శనలో, అదే అభ్యంతరానికి ప్రచారకుడు ఔచిత్యంతో ప్రతిస్పందిస్తున్నట్లు చూపించండి.
పాట 47, ప్రార్థన