కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/11 పేజీ 2
  • ఆదివారాలు పరిచర్య చేయగలరా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆదివారాలు పరిచర్య చేయగలరా?
  • మన రాజ్య పరిచర్య—2011
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రైస్తవులు విశ్రాంతి దినమును ఆచరింపవలెనా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • లూదియ—ఆతిథ్యమిచ్చే దైవారాధికురాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని పాటించాలా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మీ పరిచర్యను పూర్తిస్థాయిలో చేస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2011
km 5/11 పేజీ 2

ఆదివారాలు పరిచర్య చేయగలరా?

1. పౌలు, ఆయన తోటివాళ్లు ఫిలిప్పీలో చేసిన దాని నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

1 అది విశ్రాంతి దినం, ఫిలిప్పీలో ఉంటున్న చాలామంది యూదులు ఆ రోజు విశ్రాంతి తీసుకుంటున్నారు. పౌలు, ఆయన తోటివాళ్లు ఒక మిషనరీ యాత్రలో భాగంగా, ఆ పట్టణానికి చేరుకున్నారు. వాళ్లు ఎంతో అలసిపోయివున్నారు కాబట్టి ఆ రోజు కూడా పరిచర్య చేయకుండా విశ్రాంతి తీసుకొని ఉంటే ఎవరూ వాళ్లను తప్పుపట్టి ఉండేవాళ్లు కాదు. అయితే, యూదులు ప్రార్థన కోసం పట్టణం బయట సమకూడుతారని వాళ్లకు తెలుసు కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని వాళ్లు ఆ యూదులకు ప్రకటించారు. వాళ్లు ప్రకటించింది లూదియ విని ఆమె ఇంటి వాళ్లందరూ బాప్తిస్మం తీసుకున్నప్పుడు పౌలు, ఆయన తోటివాళ్లు ఎంతో సంతోషించివుంటారు. (అపొ. 16:13-15) ఈ రోజుల్లో చాలామందికి ఆదివారం సెలవు ఉంటుంది కాబట్టి ఆ రోజు వాళ్లకు ప్రకటించడానికి కొంత సమయాన్ని ఎందుకు కేటాయించకూడదు?

2. ఆదివారం ప్రకటించడానికి వీలుగా యెహోవా ప్రజలు ఎలాంటి సవాళ్లను అధిగమించారు?

2 ఆదివారం ప్రకటించడానికి చేసిన పోరాటం: 1927వ సంవత్సరంలో, ప్రతీ ఆదివారం కొంచెంసేపు పరిచర్య చేయాలని యెహోవా ప్రజలు ప్రోత్సహించబడ్డారు. వెంటనే దానికి వ్యతిరేకత ఎదురైంది. ఆదివారం సబ్బాతు నియమాలను ఉల్లంఘిస్తున్నందుకు, శాంతి లేకుండా చేస్తున్నందుకు, లైసెన్సు లేకుండా పుస్తకాలు అమ్ముతున్నందుకు అమెరికాలో చాలామంది అరెస్టు చేయబడ్డారు. కానీ, యెహోవా ప్రజలు మాత్రం ప్రకటించడం ఆపలేదు. 1930లలో వాళ్లు “విభాగ ఉద్యమాలను” ఏర్పాటు చేసుకున్నారు, దానిలో భాగంగా ఒక ప్రాంతంలో పరిచర్య చేయడానికి దాని చుట్టుప్రక్కల సంఘాల ప్రచారకులు వచ్చేవాళ్లు. ప్రచారకులు అరెస్టు చేయబడిన సందర్భాల్లో, అలా వచ్చినవాళ్లు పెద్ద సంఖ్యలో ఉండేవాళ్లు కాబట్టి అధికారులు ఏమీ చేయలేకపోయేవాళ్లు. ఆ సహోదరులు చేసిన త్యాగాలను మీరు నిజంగా విలువైనవిగా ఎంచుతున్నారా, వాళ్లలా ఆసక్తి చూపించాలనుకుంటున్నారా?

3. పరిచర్య చేయడానికి ఆదివారం ఎందుకు అనువైన రోజు?

3 ప్రకటించడానికి అనువైన రోజు: ఆదివారం చాలామందికి సెలవు ఉంటుంది. సాధారణంగా ఆ రోజు వాళ్లు తీరిగ్గా ఉంటారు. చర్చికి వెళ్లే కొంతమంది ఆ రోజు దేవుని గురించి మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడవచ్చు. మన కూటాలు ఆదివారం జరుగుతుంటే, మనం పరిచర్యకు తగినవిధంగా తయారై ఉంటాం కాబట్టి కూటానికి ముందూ లేదా కూటం అయిపోయిన తర్వాతా పరిచర్యకు వెళ్లడానికి ఎందుకు సిద్ధపడకూడదు? అవసరమైతే, మీతో తీసుకువెళ్లడానికి వీలుగా ఏదైనా అల్పాహారాన్ని తయారుచేసుకోండి.

4. ఆదివారం కొంచెంసేపు పరిచర్య చేస్తే మనం ఎలాంటి ఆనందాన్ని పొందవచ్చు?

4 ఆదివారం కొంచెంసేపు పరిచర్య చేస్తే మనకు అవసరమైన విశ్రాంతి తీసుకోవడానికీ సమయం ఉంటుంది. విశ్రాంతితోపాటు, పవిత్ర సేవలో పాల్గొనడం వల్ల వచ్చే సంతృప్తి కూడా మనకు దొరుకుతుంది. (సామె. 19:23) అంతేకాదు, లూదియలాంటి వ్యక్తులను కలుసుకునే అవకాశం మనకు లభించవచ్చు!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి