మే 23తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
మే 23తో మొదలయ్యే వారం
పాట 39, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 9, 10 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: కీర్తనలు 19-25 (10 నిమి.)
నం. 1: కీర్తన 23:1–24:10 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చారు—wt 32-37 పేజీలు, 1-9 పేరాలు (5 నిమి.)
నం. 3: రోమీయులు 8:20, 21 వచనాలు ఎప్పుడు, ఎలా నెరవేరతాయి? (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: ప్రకటనలు. “ప్లీజ్ ఫాలో అప్ (S-43) ఫారమ్‌ను ఎలా ఉపయోగించాలి?” చర్చ.
10 నిమి: ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం—అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రార్థించడం. మార్చి 2005 మన రాజ్య పరిచర్య 8వ పేజీలోని ఆర్టికల్ ఆధారంగా ప్రసంగం. ఈ భాగాన్ని సిద్ధపడుతున్నప్పుడు కావలికోట, జూలై 15, 2002, 27వ పేజీలోని 5-6 పేరాలు చూడండి. ఒక ప్రచారకుడు/రాలు తన బైబిలు విద్యార్థికి యేసుక్రీస్తు ద్వారా యెహోవాకు ప్రార్థించడం ఎంత ప్రాముఖ్యమో వివరిస్తున్నట్లు ఒక ప్రదర్శనలో చూపించండి.
15 నిమి: మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడిన సలహాలను ఉపయోగించడానికి ప్రయత్నించారా? చర్చ. ఒక ప్రసంగంలో, మన రాజ్య పరిచర్యలో ఇటీవల వచ్చిన “ప్రతీ సందర్భంలో దానిని ఉపయోగించండి” (km 12/10), “కుటుంబాలకు సహాయం” (km 1/11) అనే ఆర్టికల్స్‌లో ఉన్న సమాచారాన్ని క్లుప్తంగా పరిశీలించండి. వీటిలో ఇవ్వబడిన సూచనలను పాటించడానికి ఎలా ప్రయత్నించారో, దానివల్ల ఎలా ప్రయోజనం పొందారో ప్రేక్షకులను చెప్పమనండి.
పాట 6, ప్రార్థన