క్షేత్రసేవా కూటాల్లో ఇక మీదట దినవచనం పరిశీలించకూడదు
ఇంతకు ముందు, దినవచనం పరిచర్యకు సంబంధించినదైతే దాన్ని క్షేత్రసేవా కూటంలో క్లుప్తంగా చర్చించి ఉంటాం. అయితే, ఇప్పుడు అలా చేయకూడదు. ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం పుస్తకాన్ని క్షేత్రసేవా కూటం జరపడానికి ఉపయోగించకూడదు. క్షేత్రసేవా కూటాన్ని నిర్వహించే వాళ్లు ఇంతకు ముందులా బైబిలు, మన రాజ్య పరిచర్య, బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకం, పరిచర్య పాఠశాల పుస్తకం లేదా పరిచర్యకు సంబంధించిన ఇతర సమాచారాన్ని ఉపయోగించవచ్చు. క్షేత్రసేవా కూటం నిర్వహించే వాళ్లు, ఆ రోజు పరిచర్యకు వెళ్లేవాళ్లకు ఉపయోగపడే విషయాలేవైనా చెప్పడానికి వీలుగా బాగా సిద్ధపడాలి. ఎప్పటిలాగే, క్షేత్రసేవా కూటం 10 నుండి 15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండకూడదు. సంఘ కూటం అయిపోయిన తర్వాత క్షేత్రసేవా కూటం జరుపుకుంటే అంతకంటే తక్కువ సమయం తీసుకోవాలి.