దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2011 ఫిబ్రవరి 28తో ప్రారంభమయ్యే వారంలో, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ క్రింది ప్రశ్నలు పరిశీలించబడతాయి. పాఠశాల పర్యవేక్షకుడు, 2011 జనవరి 3 నుండి ఫిబ్రవరి 28 మధ్య వారాల్లోని ప్రసంగాల సమాచారం ఆధారంగా 20 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు.
1. హిజ్కియా తన పరిపాలన ఆరంభంలో ఏ పనిని మొదలుపెట్టాడు, మనం ఈ రోజుల్లో ఆయన నుండి ఏమి నేర్చుకోవచ్చు? (2 దిన. 29:16-18) [w09 6/15 9వ పేజీ, 13వ పేరా]
2. యిర్మీయా 25:8-11లో ఉన్న ప్రవచనం నెరవేరిందని 2 దినవృత్తాంతములు 36:21 ఎలా చూపిస్తుంది? [w06 11/15 32వ పేజీ, 1-4 పేరాలు]
3. యెరూషలేము నిర్మానుష్యంగా ఉండాల్సిన 70 సంవత్సరాల గడువు సరైన సమయంలో ముగిసిందని లేఖనాలు చెబుతున్నదాన్ని ఎజ్రా 3:1-6 వచనాలు ఎలా సమర్థిస్తున్నాయి? [w06 1/15 19వ పేజీ, 2వ పేరా]
4. ఆ దేశంలోని అన్యులను వివాహం చేసుకోవడాన్ని గురించి విన్నప్పుడు ఎజ్రా ఎందుకు విభ్రాంతి చెందాడు? (ఎజ్రా 9:1-3) [w06 1/15 20వ పేజీ, 1వ పేరా]
5. “అధికారులు” ఎవరు, వాళ్లకున్న ఎలాంటి స్వభావం మనకు ఉండకూడదు? (నెహె. 3:5) [w06 2/1 10వ పేజీ, 1వ పేరా]
6. అధిపతియైన నెహెమ్యా క్రైస్తవ పర్యవేక్షకులకు ఎలా ఒక మంచి ఉదాహరణగా ఉన్నాడు? (నెహె. 5:14-19) [w06 2/1 10వ పేజీ, 4వ పేరా]
7. నెహెమ్యా కాలంలోని ఇశ్రాయేలీయుల్లా, మనం “మన దేవుని గృహమును” అలక్ష్యం చేయకుండా ఉండాలంటే ఏమి చేయాలి? (నెహె. 10:32-39) [w98 10/15 21-22 పేజీలు, 12వ పేరా]
8. నెహెమ్యా పనిని గురించి తలపోయడం మనల్ని మనం ఏ ప్రశ్నలు వేసుకోవడానికి కారణం కాగలదు? (నెహె. 13:31) [w96 9/15 17వ పేజీ, 3వ పేరా]
9. ఎస్తేరు, అహష్వేరోషు రాజుతో అనైతిక లైంగిక సంబంధాలు పెట్టుకుందా? (ఎస్తే. 2:14-17) [w06 3/1 9వ పేజీ, 3వ పేరా]
10. మొర్దెకై హామానుకు మోకరిల్లి నమస్కరించడానికి ఎందుకు తిరస్కరించాడు? (ఎస్తే. 3:2, 4) [w06 3/1 9వ పేజీ, 4వ పేరా]