ఫిబ్రవరి 28తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఫిబ్రవరి 28తో మొదలయ్యే వారం
పాట 5, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
w08 4/15, 18-20 పేజీలు, 9-17 పేరాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఎస్తేరు 1-5 (10 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: అనుకూలంగా మాట్లాడండి. పరిచర్య పాఠశాల పుస్తకం, 202వ పేజీలో ఉన్న సమాచారం ఆధారంగా ప్రసంగం. చివరి పేరాలో ఉన్న సలహాలను ఉపయోగించి, వచ్చే నెలలో అందించబోయే ప్రచురణ ఎలా ఇవ్వవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.
10 నిమి: ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం నుండి ప్రయోజనం పొందండి. లేఖనాలను పరిశోధిద్దాం—2011లోని ముందుమాట ఆధారంగా చర్చ. ప్రతీరోజు దినవచనాన్ని పరిశీలించమని అందర్నీ ప్రోత్సహించండి. దినవచనం ఎప్పుడు చదువుతారో, దానివల్ల వాళ్లు ఎలా ప్రయోజనం పొందుతున్నారో చెప్పమని ప్రేక్షకులను అడగండి. 2011 వార్షిక వచనాన్ని క్లుప్తంగా పునఃసమీక్షించండి. “క్షేత్రసేవా కూటాల్లో ఇక మీదట దినవచనం పరిశీలించకూడదు” చర్చించండి.
10 నిమి: ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం—విద్యార్థి ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఏమి చేయాలి? మన రాజ్య పరిచర్య, ఫిబ్రవరి 2005, 6వ పేజీలో ఉన్న ఆర్టికల్ ఆధారంగా ప్రసంగం. జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చినవాళ్లలో కొంతమందే రొట్టె, ద్రాక్షారసం ఎందుకు తీసుకుంటారని ఒక బైబిలు విద్యార్థి అడుగుతున్నట్టు ఒక ప్రదర్శనలో చూపించండి. అధ్యయనం నిర్వహిస్తున్న ప్రచారకుడు విద్యార్థి ఆ ప్రశ్న అడిగినందుకు ఆయనను మెచ్చుకుని, విద్యార్థి అడిగిన ప్రశ్న ఒక పేపరు మీద రాసుకుని, అధ్యయనం పూర్తయిన తర్వాత దాన్ని చర్చిద్దామని చెబుతాడు. అధ్యయనం చివర్లో, బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని 206వ పేజీ నుండి 208వ పేజీ వరకున్న సమాచారాన్ని పరిశీలిద్దామని ఆయన చెబుతాడు.
పాట 33, ప్రార్థన