2011 క్యాలెండరు కుటుంబ ఆరాధన ఎంత ప్రాముఖ్యమో చూపిస్తుంది
యెహోవాసాక్షుల క్యాలెండరు—2011 ముఖ్యాంశం కుటుంబ ఆరాధన. ఈ క్యాలెండరు ఇప్పుడున్న కుటుంబాలను, బైబిలు కాలాల్లో ఉన్న ఇదే విధమైన కుటుంబాలను చూపిస్తుంది. భార్యాభర్తలు, అలాగే ఒంటరిగా యెహోవా సేవచేస్తున్న వాళ్లు ఆయన వాక్యాన్ని చదువుతున్నట్టు కూడా చిత్రాల్లో చూపించబడింది.
క్యాలెండరులో చూపించిన బైబిల్లో ప్రస్తావించబడిన వ్యక్తులు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించారు కాబట్టే, వాళ్లు తమకు వ్యక్తిగతంగా ఎదురైన సమస్యలతో వ్యవహరించగలిగారు. (కీర్త. 1:2, 3) క్యాలెండరులోని ప్రతీ చిత్రాన్ని గమనిస్తున్నప్పుడు, మనం పెద్ద కుటుంబానికి చెందినవాళ్లమైనా చిన్న కుటుంబానికి చెందినవాళ్లమైనా, మన కుటుంబంలో అందరూ యెహోవాసాక్షులే అయినా కాకపోయినా కుటుంబ ఆరాధన చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఒక్కో చిత్రం మనకు గుర్తుచేస్తుంది. కుటుంబ ఆరాధనకు మీ కుటుంబం కేటాయించుకున్న రోజును రాసుకోవడం కోసం క్యాలెండరులో ప్రత్యేకంగా ఒక ఖాళీ స్థలం ఇవ్వబడింది. మీరు ఆ రోజును దానిలో రాసుకున్నారా?