దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2010 డిసెంబరు 27తో మొదలయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు పరిశీలిస్తాం. పాఠశాల పర్యవేక్షకుడు, 2010 నవంబరు 1 నుండి డిసెంబరు 27 మధ్య వారాల్లోని నియామకాల సమాచారం ఆధారంగా 20 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు.
1. మొదటి దినవృత్తాంతములు 16:34 లో నమోదు చేయబడిన, లేవీ గాయకుల స్తుతుల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? [w02 1/15 11వ పేజీ, 6-7 పేరాలు]
2. మొదటి దినవృత్తాంతములు 22:5, 9 లో నమోదు చేయబడిన దావీదు పనుల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? [w05 10/1 11వ పేజీ, 7వ పేరా]
3. దేవుని గురించి తన కుమారుడైన సొలొమోను ఎలా అనుకోవాలని దావీదు కోరుకున్నాడు? (1 దిన. 28:9) [w08 10/15 7వ పేజీ, 18వ పేరా]
4. పోతపోసిన సముద్రపు తొట్టి అడుగున ఎద్దుల రూపాలను ఉపయోగించడం ఎందుకు సరైనది? (2 దిన. 4:2-4) [w05 12/1 19వ పేజీ, 3వ పేరా; w98 6/15 16వ పేజీ, 17వ పేరా]
5. నిబంధనా మందసంలో రెండు రాతి పలకలు మాత్రమే ఉన్నాయా లేక ఇతర వస్తువులు కూడా ఉన్నాయా? (2 దిన. 5:10) [w06 1/15 31వ పేజీ]
6. రెండవ దినవృత్తాంతములు 6:18-21 లో నమోదు చేయబడిన సొలొమోను ప్రార్థన నుండి మనమేమి నేర్చుకోవచ్చు? [w05 12/1 19వ పేజీ, 8వ పేరా]
7. రెండవ దినవృత్తాంతములు 13:5 అధస్సూచిలోవున్న “ఉప్పు నిబంధన” అనే మాటకు అర్థమేమిటి? [w05 12/1 20వ పేజీ, 2వ పేరా]
8. రెండవ దినవృత్తాంతములు 17:9, 10 లోవున్న సూత్రం మన పరిచర్యకు ఎలా వర్తిస్తుంది? [w09 6/15 12వ పేజీ, 7వ పేరా]
9. రెండవ దినవృత్తాంతములు 20:17 లో ఉన్నదానికి అనుగుణంగా నేడు దేవుని ప్రజలు ఎలా ప్రవర్తిస్తారు? [w03 6/1 21-22 పేజీలు, 14-17 పేరాలు]
10. రాజైన ఉజ్జియా గర్వంగా ప్రవర్తించిన తీరు నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (2 దిన. 26:15-21) [w99 12/1 26వ పేజీ, 1-2 పేరాలు]