మార్చి 22తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
మార్చి 22తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv అనుబంధంలోని 239-242 పేజీలు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 సమూయేలు 10-13
నం. 1: 1 సమూయేలు 10:17-27
నం. 2: మీ భర్తకు వేరే విశ్వాసం ఉంటే (fy 129-132 పేజీలు, 3-9 పేరాలు)
నం. 3: పరిణామ సిద్ధాంతం క్రైస్తవత్వంతో ఎందుకు పొందికగా లేదు?
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు. జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించి చేయాల్సిన ప్రకటనలు ఇంకా ఏవైనా ఉంటే వాటిని కూడా చేర్చండి.
15 నిమి: కావలికోట ఏప్రిల్ - జూన్ ప్రత్యేక సంచికను అందించడానికి సిద్ధపడండి. ఈ సంచికలోని ఆర్టికల్స్ గురించి చెప్పండి. ఈ పత్రికను ఇవ్వడానికి ఏ ప్రశ్న అడగాలనుకుంటున్నారో, ఏ లేఖనం చూపించాలనుకుంటున్నారో ప్రేక్షకులను చెప్పమనండి. బైబిలును గౌరవించే వాళ్లకు మాత్రమే ఈ పత్రిక ఇవ్వాలి. మీ సంఘ క్షేత్రంలో చర్చికి వెళ్లే ప్రతీఒక్కరికీ ఈ పత్రిక అందేలా చూడాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రెండు ప్రదర్శనల ద్వారా చూపించండి.
15 నిమి: జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన ఆసక్తిగలవారికి సహాయం చేయండి. పెద్ద ఇచ్చే ప్రసంగం. బైబిలు విద్యార్థులకు, నిష్క్రియులైన ప్రచారకులకు, ఇతరులకు ఎలా సహాయం చేయవచ్చో ప్రచారకులకు ఆయన గుర్తుచేయాలి. (మార్చి 2008 మన రాజ్య పరిచర్యలోని 8వ పేజీ చూడండి.) ఒక క్లుప్తమైన ప్రదర్శనను చేయించండి. జ్ఞాపకార్థ ఆచరణ బైబిలు పఠనం గురించి అందరికీ గుర్తుచేయండి.