కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/10 పేజీలు 3-4
  • పరిపాలక సభ రాసిన ఉత్తరం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పరిపాలక సభ రాసిన ఉత్తరం
  • మన రాజ్య పరిచర్య—2010
మన రాజ్య పరిచర్య—2010
km 3/10 పేజీలు 3-4

పరిపాలక సభ రాసిన ఉత్తరం

ప్రియమైన తోటి యెహోవాసాక్షులకు,

విశ్వసర్వాధిపతియైన యెహోవా నామం ధరించిన ప్రజలుగా ఉండడం మనకు లభించిన గొప్ప గౌరవం! ఆ నామం సాటిలేనిది, నశించనిది, నిత్యం ఉంటుంది. యెహోవాయే తన నామం ధరించే ఆధిక్యతను మనకిచ్చాడు, ప్రాముఖ్యంగా 1931వ సంవత్సరం నుండి మనం ఆ ప్రత్యేకమైన పేరుతో గుర్తించబడుతున్నాం. (యెష. 43:10) యెహోవాసాక్షులమని చెప్పుకోవడానికి మనమెంతో గర్వపడతాం.

దేవుని పేరును పూర్తిగా తుడిచిపెట్టెయ్యాలని అపవాది విశ్వప్రయత్నం చేస్తూనేవున్నాడు. అతడు జనాంగాలు యెహోవా పేరును తిరస్కరించేలా చేస్తున్నాడు. ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను దేవుని పేరును ద్వేషిస్తూ, దాన్ని చాలా బైబిలు అనువాదాల నుండి తీసివేసింది. అయితే యేసు దానికి పూర్తి భిన్నంగా, తన అనుచరులకు నేర్పిన మాదిరి ప్రార్థనలో తన తండ్రి పేరుకు మొదటి స్థానం ఇచ్చాడు. ఆయన ఇలా అన్నాడు: “మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక.” (మత్త. 6:9) ఆ తర్వాత మరో సందర్భంలో తన తండ్రికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, “లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని” అని అన్నాడు. (యోహా. 17:6) యేసును ఆదర్శంగా తీసుకుంటూ, ఇంతకు ముందెప్పుడు లేనంత ఉత్సాహంగా యెహోవా పేరును భూమంతటా ప్రకటించాలని నిర్ణయించుకున్నాం.

2009వ సంవత్సరానికి ఎంపిక చేయబడిన ‘సువార్త గురించి సమగ్రంగా సాక్ష్యమివ్వండి’ అనే వార్షిక వచనం పరిచర్యను ఇంకా ఎక్కువగా చేయడానికి మనల్ని ప్రోత్సహించింది. (అపొ. 20:24) గడిచిన సేవా సంవత్సరంలో యెహోవా మన ప్రయత్నాలను మెండుగా ఆశీర్వదించాడు అనడంలో సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా సాక్ష్యం ఇవ్వడం వల్ల యెహోవా పేరుకు ఘనత, మహిమ కలిగాయి. ప్రజలందరికి ప్రకటించడానికీ, ప్రతీరోజు ఎదురౌతున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం వెతుకుతున్న మంచి మనసున్నవారికి బోధించడానికీ ఇంతకు ముందెప్పుడూ లేనంతగా 73,13,173 మంది ప్రచారకులు ముందుకొచ్చారు. క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు 1,81,68,323 మంది హాజరవ్వడం చూస్తే, ఈ దుష్ట విధానం అంతం కాకముందు ఇంకా ఎన్నో లక్షలమంది యెహోవా పేరు తెలుసుకుని, ఆయనకు ప్రార్థన చేస్తారనే నమ్మకం కలుగుతుంది.

యెహోవా అనుమతించినంత వరకు, మన ప్రాంతంలో ఉన్న ప్రజలను సాధ్యమైన విధంగా కలుసుకుని ఉత్సాహంతో రాజ్య సువార్తను ప్రకటిస్తూనే ఉందాం. (మత్త. 24:14; మార్కు 13:10) ఇంటింటి పరిచర్యలో, వీధిసాక్ష్యంలో, ఉత్తరాలు రాస్తూ, ఫోన్లు చేస్తూ, మరెక్కడైనా అవకాశం దొరికితే మాట్లాడడం ద్వారా వీలైనంత ఎక్కువమందికి యెహోవా పేరు గురించి, ఆయన చిత్తం గురించి తెలియజేయడానికి కృషి చేద్దాం.

యెహోవా తన నామాన్ని పరిశుద్ధపర్చుకోవడానికి త్వరలోనే చర్యలు తీసుకుంటాడని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. (యెహె. 36:23) దేవుని నామానికున్న గౌరవాన్ని తగ్గించాలని చూస్తున్నవారందరి నోళ్లు త్వరలోనే మూతపడతాయి. యెహోవా పేరును తెలియజేస్తూ, ఆయన విశ్వసర్వాధిపత్యాన్ని గౌరవించిన ఆయన నమ్మకమైన సేవకులందరూ ఆ రోజున ఎంతో సంతోషిస్తారు!

2009లో దాదాపు ప్రపంచమంతటా జరిగిన “మెలకువగా ఉండండి!” జిల్లా, అంతర్జాతీయ సమావేశాల్లో యెహోవాకు తన ప్రజల మీదున్న ప్రేమ, శ్రద్ధ స్పష్టంగా కనిపించాయి. ఈ సమావేశాలు మన దైవపరిపాలన చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచాయి. అంతేకాదు, అవి యెహోవా దినం కోసం మెలకువగా ఉండవలసిన అవసరాన్ని ఇంకెక్కువగా గుర్తించడానికి సహాయం చేశాయి.—మార్కు 13:37; 1 థెస్స. 5:1, 2, 4.

నిజంగా, యెహోవా మనకు ఎంతో మేలు చేస్తూ, మన హృదయాలను ఆనందంతో నింపుతున్నాడు. ఆయన మనల్ని పచ్చికగల చోట్ల సేదదీరేలా చేస్తూ, శాంతికరమైన జలముల దగ్గరగా నడిపిస్తున్నాడు.—కీర్త. 23:1, 2; 100:2, 5.

రాబోయే నెలల్లో ఉత్సాహంగా రాజ్య పరిచర్య చేస్తుండగా యెహోవా మన పనిని ఆశీర్వదిస్తూ ఉంటాడనే నమ్మకంతో ఉండండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరులందరికీ క్రైస్తవ ప్రేమను తెలియజేస్తున్నాం.

మీ సహోదరులు,

యెహోవాసాక్షుల పరిపాలక సభ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి