మార్చి 29తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
మార్చి 29తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 5వ అధ్యాయం 1-6 పేరాలు, 60, 61 పేజీల్లోవున్న బాక్సులు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 సమూయేలు 14, 15
నం. 1: 1 సమూయేలు 14:24-35
నం. 2: యెహోవాకు సన్నిహితమవ్వడానికి మార్గాలు (యాకో. 4:8)
నం. 3: భార్య క్రైస్తవురాలు కానప్పుడు (fy 132వ పేజీ, 10, 11 పేరాలు)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: బైబిలు అధ్యయనాలు ప్రారంభించండి. బైబిలు అధ్యయనాలు ప్రారంభించి, వాటిని నిర్వహిస్తున్న ఒక ప్రచారకుణ్ణి ఇంటర్వ్యూ చేయండి. ఏ ఉపోద్ఘాతాలు ఉపయోగిస్తే క్షేత్రంలోని ప్రజలు చక్కగా వింటున్నారు? పునర్దర్శనాలు చేసేటప్పుడు వేటిని మనస్సులో ఉంచుకుంటున్నాడు? ఆయన ఉపయోగించే ఉపోద్ఘాతాల్లో ఒకదాన్ని చేసి చూపించమనండి.
10 నిమి: ఇంతవరకు ఎప్పుడూ జరగని అతిగొప్ప అన్వేషణలో పాల్గొనండి! సంస్థీకరించబడ్డాం పుస్తకం, 95వ పేజీలోవున్న “యోగ్యులను అన్వేషించడం” అనే ఉపశీర్షిక ఆధారంగా ప్రసంగం.
10 నిమి: “మీతోపాటు పరిచర్య చేస్తున్నవారికి తోడ్పడండి.” ప్రశ్నాజవాబుల చర్చ.