మార్చి 30తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
మార్చి 30తో ప్రారంభమయ్యే వారం
పాట 28 (224)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 64వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: నిర్గమకాండము 1-6
నం. 1: నిర్గమకాండము 1:1-19
నం. 2: వ్యాధులతో చేసే పోరాటం (g04-TU 7/8 3-13 పేజీలు)
నం. 3: కుటుంబంలో క్రీస్తువంటి శిరస్సత్వం (fy-TU 31-33 పేజీలు, 11-15 పేరాలు)
❑ సేవాకూటం:
పాట 13 (124)
5 నిమి: ప్రకటనలు. జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన చివరి ప్రకటనలు ఏమైనా ఉంటే చెప్పండి.
15 నిమి: జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన ఆసక్తిగలవారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి. బైబిలు విద్యార్థులకు, నిష్క్రియులైన ప్రచారకులకు, జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన పరిచయస్థులు, కుటుంబ సభ్యులు వంటి ఇతరులకు సహాయం చేయడానికి ఏమి చేయవచ్చో ప్రచారకులకు గుర్తుచేస్తూ సేవా పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగం. (మన రాజ్య పరిచర్య మార్చి 2008, 8వ పేజీ చూడండి.) జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన ఆసక్తిగల వ్యక్తితో బైబిలు అధ్యయనాన్ని ఎలా ప్రారంభించవచ్చో క్లుప్తంగా ప్రదర్శింపజేయండి. ఆదివారం, ఏప్రిల్ 5నుండి ప్రారంభమయ్యే జ్ఞాపకార్థ ఆచరణ బైబిలు పఠనం గురించి అందరికీ గుర్తుచేయండి. బైబిలు పఠనం ఎలా చేయవచ్చనే దానిపై ఆచరణాత్మక సూచనలివ్వవచ్చు.
15 నిమి: వృద్ధాప్యంలో ఆధ్యాత్మికంగా చిగురిస్తూ ఉండడం. కావలికోట జూన్ 1, 2007 21-22 పేజీల్లో, 1-6 పేరాల్లోవున్న సమాచారం ఆధారంగా ఉత్సాహవంతమైన ప్రసంగం. ఎంతోకాలం నుండి విశ్వసనీయంగా యెహోవా సేవ చేస్తున్న ఒకరిని ఇంటర్వ్యూ చేయండి. యెహోవాను సేవించడంలో ఆనందాన్ని కాపాడుకోవడానికి ఆయనకు/ఆమెకు సహాయం చేసినదేమిటి?
పాట 11 (85)