జ్ఞాపకార్థ ఆచరణకు పూర్తిగా సిద్ధపడివుండండి
యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ కోసం పూర్తిగా సిద్ధపడివుండడం క్రీస్తు అనుచరులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, నిజంగా అది వారికి లభించిన ఘనత. (లూకా 22:19) జ్ఞాపకార్థ ఆచరణ కోసం సిద్ధపడివుండడానికి మనమేమి చేయాలి?
▪ సమయం, స్థలం: జ్ఞాపకార్థ ఆచరణ జరిగే సమయం, స్థలం ప్రతీ ఒక్కరికీ స్పష్టంగా తెలిసివుండాలి. రెండు మూడు సంఘాలు రాజ్యమందిరంలోనే జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకోబోతుంటే ఒక ఆచరణకు మరో ఆచరణకు మధ్య పరిమిత సమయం మాత్రమే ఉంటుంది కాబట్టి సమయానికి వచ్చి, క్రమపద్ధతిలో వెళ్ళిపోవడం ప్రాముఖ్యం. ప్రవేశ మార్గాల్లో, వరండాలో, ఫుట్పాత్లపైనా, పార్కింగ్ స్థలాల్లోనూ అనవసర రద్దీలేకుండా జాగ్రత్తవహించాలి.
▪ ఆహ్వానప్రతులు: ప్రచారకులందరి దగ్గరా తగినన్ని ఆహ్వానప్రతులు ఉన్నాయా, ఆ ఆహ్వానప్రతిలో ఉన్న విషయాల గురించి వారికి తెలుసా? ఆ ఆహ్వానప్రతిని ఎలా అందించాలనేది మీరు ముందుగా సిద్ధం చేసుకున్నారా? మీరు ఆహ్వానప్రతిని ఎవరెవరికి ఇస్తారు? అన్ని ఆహ్వానప్రతులను అందించేందుకు కృషిచేయాలి.
▪ రవాణా: సహోదర సహోదరీలకు, ఆసక్తిగలవారిలో కొంతమందికి రవాణా లేదా మరేదైనా సహాయం అవసరం కావచ్చు. వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలో ఆలోచించారా?
▪ జ్ఞాపకార్థ చిహ్నాలు: సూర్యాస్తమయం కాకముందే జ్ఞాపకార్థ చిహ్నాలు అందించబడకుండా జాగ్రత్త వహించండి. అనారోగ్యంతో బాధపడుతూ, జ్ఞాపకార్థ ఆచరణకు రాలేని అభిషిక్తులకు జ్ఞాపకార్థ చిహ్నాలను అందించడానికి ఏర్పాట్లు చేయాలి. తగిన విధమైన రొట్టె, ద్రాక్షారసం అందించబడేలా చూడడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.—కావలికోట ఫిబ్రవరి 15, 2003, 14వ పేజీ, 14వ పేరా చూడండి.
▪ రాజ్యమందిరం: హాలును ముందుగానే పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ప్లేట్లు, వైన్ గ్లాసులు, తగిన టేబులు, టేబులు క్లాత్ జ్ఞాపకార్థ ఆచరణ జరిగే హాలుకు తీసుకువచ్చి ముందుగానే తగిన స్థలంలో ఉంచాలి. రాజ్యమందిరం కాక మరో హాలు ఏదైనా ఉపయోగించుకోబడుతున్నట్లయితే ప్రసంగీకుడు చెప్పేది ప్రేక్షకులందరూ వినడానికి వీలుగా తగిన సౌండ్ సిస్టమ్ ఉండేలా చూసుకోవాలి. అటెండెంట్లను, చిహ్నాలు అందించే వారిని ఎంపిక చేసుకొని వారు చేయవలసిన పనుల గురించి, అనుసరించవలసిన పద్ధతి గురించి, గౌరవప్రదమైన వస్త్రధారణ, కనబడే తీరు గురించి వారికి ముందుగానే చెప్పాలి.
యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ అనే ఈ అత్యంత ప్రాముఖ్యమైన సందర్భంలో మనం వ్యక్తిగతంగానూ ఒక సంఘంగానూ పూర్తిగా సిద్ధపడివుండాలని కోరుకుంటాము. యెహోవా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును బలి అర్పించడం ద్వారా మానవజాతి కోసం చేసిన దానంతటి పట్ల హృదయపూర్వక కృతజ్ఞతను కనపరిచే వారందరికీ ఆయన అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదాలు తప్పక లభిస్తాయి.