జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన జ్ఞాపికలు
జ్ఞాపకార్థ ఆచరణ, ఈ సంవత్సరం మార్చి 24, గురువారం జరుగుతుంది. పెద్దలు ఈ క్రింది విషయాల్లో శ్రద్ధ వహించాలి:
◼ కూటం జరిగే సమయం నిర్ణయించేటప్పుడు, సూర్యాస్తమయానికి ముందే చిహ్నాలను అందించకుండా చూడాలి.
◼ ప్రసంగీకునితోపాటు ప్రతి ఒక్కరికీ ఈ ఆచరణ జరిగే ఖచ్చితమైన సమయాన్ని, స్థలాన్ని తెలపాలి.
◼ జ్ఞాపకార్థ ఆచరణకు తగిన రొట్టెను ద్రాక్షారసాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి.—కావలికోట, ఫిబ్రవరి 15, 2003, 14-15 పేజీలు చూడండి.
◼ ప్లేట్లు, గ్లాసులు, అనుకూలమైన టేబుల్, టేబుల్క్లాత్ ఇవన్నీ ఆచరణ జరిగే స్థలానికి ముందే తీసుకొచ్చి, వాటిని వాటి సంబంధిత స్థలంలో పెట్టుకోవాలి.
◼ రాజ్యమందిరాన్ని లేదా ఆచరణ జరిగే స్థలాన్ని ముందుగానే బాగా శుభ్రపరచాలి.
◼ అటెండెంట్లను, చిహ్నాలు అందించే వారిని ఎంపిక చేసుకొని వారు చేయవలసిన పనుల గురించి, అనుసరించవలసిన సరైన పద్ధతి గురించి, గౌరవప్రదమైన వస్త్రధారణ, కనబడే తీరు గురించి వారికి ముందుగానే చెప్పాలి.
◼ అనారోగ్యంతో ఉండి, హాజరుకాలేని స్థితిలోవున్న అభిషిక్తులు ఎవరైనా ఉంటే వారికి చిహ్నాలు అందించేలా తగిన ఏర్పాట్లు చేయాలి.
◼ ఒకే రాజ్యమందిరాన్ని ఒకటికన్నా ఎక్కువ సంఘాలు ఉపయోగించుకుంటున్న వరండాలో లేదా ప్రవేశ మార్గాల్లో, ఫుట్పాత్లపైనా, పార్కింగ్ స్థలాల్లోనూ అనవసర రద్దీలేకుండా జాగ్రత్తపడేందుకు సంఘాల మధ్య మంచి సమన్వయం ఉండాలి.