కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/09 పేజీలు 3-4
  • పరిపాలక సభ నుండి ఉత్తరం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పరిపాలక సభ నుండి ఉత్తరం
  • మన రాజ్య పరిచర్య—2009
  • ఉపశీర్షికలు
  • ప్రియమైన తోటి యెహోవాసాక్షులకు:
మన రాజ్య పరిచర్య—2009
km 3/09 పేజీలు 3-4

పరిపాలక సభ నుండి ఉత్తరం

ప్రియమైన తోటి యెహోవాసాక్షులకు:

ప్రియమైన సహోదరులారా, మీకు ఈ ఉత్తరం రాయడానికి మేమెంతో సంతోషిస్తున్నాము. తన తోటి విశ్వాసులను “నిజముగా ప్రేమించుచున్నా[ను]” అని చెప్పడమేకాక వాళ్ళు ‘సత్యమును అనుసరించి నడుచుచున్నందుకు’ ఎంతో సంతోషించిన అపొస్తలుడైన యోహానులాగే మేము భావిస్తున్నాము. (2 యోహా. 1, 2, 4) సత్యం మనందరికీ నిజంగా గొప్ప ఆశీర్వాదమే! సత్యం మనల్ని మహా బబులోను నుండి, దేవుని అగౌరవపరిచే దాని సిద్ధాంతాల నుండి ఆచారాల నుండి విముక్తి కలిగించింది. సత్యానికి అనుగుణంగా నడుచుకోవడం మూలంగా మనం ప్రేమ, దయ, కనికరం గల ప్రజలమయ్యాం. అంతేగాక మనం దేవుని ఎదుట నిందారహితంగా ఉండడానికి, నిత్యజీవ నిరీక్షణను పొందడానికి సత్యం మనకు మార్గాన్ని ఏర్పర్చింది.

మనల్ని రోజూ నడిపించి, బలపరిచే యెహోవా ఆత్మనుబట్టి కూడా మనమెంత కృతజ్ఞత కలిగివున్నామో కదా! ఇటీవల జరిగిన “పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తోంది” అనే జిల్లా సమావేశాల్లో యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపించే, బలపర్చే వివిధ మార్గాల గురించి మీరు తెలుసుకున్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ లోక పరిస్థితులు మరింత దిగజారిపోతుండగా రానున్న కష్టపరిస్థితుల్లో నిర్దేశం కోసం యెహోవా శక్తివంతమైన ఆత్మపై ఆధారపడడం ఎంతో అవసరం.

తమ విశ్వాసం కోసం ఎన్నో శ్రమలు సహించిన మన సహోదరుల వృత్తాంతాల గురించి వార్షికపుస్తకము (ఆంగ్లం)లోనుండి, ఇతర ప్రచురణలలోనుండి చదివినప్పుడు మీ హృదయాలు కదిలించబడివుంటాయని మేము నమ్ముతున్నాము. కష్టాలు తలెత్తే సమయానికి ఈ నమ్మకమైనవారిలో అనేకులు బాప్తిస్మం తీసుకొని ఎక్కువ సమయం గడవలేదనీ లేదా ఇంకా బాప్తిస్మం తీసుకోలేదనీ తెలుసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వారి యథార్థతనుబట్టి, నీతికోసం వారు వహించిన స్థానాన్నిబట్టి వారంటే మాకెంతో ప్రేమవుంది! నిజంగా వారి చక్కని మాదిరి, మనకు ఎలాంటి కష్టం వచ్చినా రాజ్యానికి కట్టుబడి ఉండాలనే మన నిశ్చయతను బలపరుస్తుంది.—1 థెస్స. 1:6-8.

ప్రియమైన సహోదర సహోదరీల్లారా, మీ కుటుంబాలను ప్రేమతో ఐక్యంగా ఉంచడానికి మీరు ఎన్నో ఆర్థిక సమస్యలను, ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నారని మాకు తెలుసు. మీలో కొంతమందికి రాజ్య ప్రకటనాపనికి మద్దతివ్వడం, కూటాలకు నమ్మకంగా, క్రమంగా హాజరవడం కూడా సవాలుదాయకమైనదే. ఆ కారణం చేతనే ఎన్నోసార్లు చర్చించిన తర్వాత, దాని విషయమై ప్రార్థించిన తర్వాత 2009 జనవరి 1 నుండి సంఘకూటాల్లో మేము కొన్ని మార్పులు చేశాము. మీరు మీ వ్యక్తిగత అధ్యయనానికి, కుటుంబ అధ్యయనానికి ఎక్కువ సమయం వెచ్చించగలిగేలా ఈ మార్పు నుండి ప్రయోజనం పొందుతారని మేము నమ్ముతున్నాము.

ఈ సంవత్సరం జరిగిన వివిధ సమావేశాల్లో, అర్హులైన చాలామంది బాప్తిస్మం తీసుకోవడం నిజంగా ఎంతో సంతోషాన్ని కలిగించింది. అలా బాప్తిస్మం తీసుకున్నవారిలో కొందరు చాలా చిన్న వయసువాళ్ళు. మీ పిల్లలు సత్యాన్ని విలువైనదిగా ఎంచేలా వారిని పెంచినందుకు, చిన్న వయసులోనే యెహోవా సేవచేసేందుకు ఆయనకు సమర్పించుకునేలా వారిని ప్రోత్సహించినందుకు తల్లిదండ్రులైన మీరు ప్రశంసనీయులు. ఈ పిల్లలు స్కూల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ బాప్తిస్మం తీసుకోవడానికి అర్హులయ్యారంటే వాళ్ళకు ఇంటి దగ్గర ఎంత మంచి తర్ఫీదు లభించిందో తెలుస్తుంది.—కీర్త. 128:1-6.

బైబిలు అధ్యయనాల్లో కూడా ప్రశంసనీయమైన అభివృద్ధి జరిగింది, కష్టపడి పనిచేసే మన మిషనరీలు, ప్రత్యేక పయినీర్లు దీనికెంతగానో తోడ్పడ్డారు. దప్పిగొనిన వాళ్ళనందరినీ ‘జీవజలమును ఉచితముగా పుచ్చుకోమని’ ఆహ్వానించడంలో, యథార్థహృదయం గలవారిని “రమ్ము” అని చెప్పడంలో, ప్రపంచవ్యాప్తంగా మన సహోదర సహోదరీలు నిర్వర్తిస్తున్న పాత్రను పరిపాలక సభ సభ్యులమైన మేమందరం ఎంతో విలువైనదిగా ఎంచుతున్నాము. (ప్రక. 22:17) గత సంవత్సరంలో నీటి బాప్తిస్మం ద్వారా తమ సమర్పణను సూచించిన 2,89,678మందిని మన ప్రపంచవ్యాప్త సహోదరత్వంలోకి మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము!

“లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” అని రాసిన అపొస్తలుడైన యోహాను మాటలను మనకు మనం ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉండాలి. (1 యోహా. 2:17) ఈ లోకం ‘గతించిపోయే’ కాలానికి మనమెంతో దగ్గర్లో ఉన్నాము! దేవుని చిత్తం చేయడానికి మన జీవితాల్లో ప్రథమస్థానమిస్తూ ‘మెలకువగా ఉండడం’ ఎంతో జ్ఞానయుక్తమైనది. (మత్త. 24:42) అలా చేస్తే మనం చింతించవలసిన అవసరం ఉండదు, అంతేగాక యెహోవా కృపాతిశయం వల్ల లభించే ప్రయోజనాలను మనం పొందగలుగుతాము.—యెష. 63:7.

మేము మీ గురించి ఆలోచిస్తున్నామని, మీ కోసం ప్రార్థిస్తున్నామని, మీ పట్ల మాకెంతో ప్రేమ ఉందని మీరు తెలుసుకోవాలని మేమెంతో కోరుకుంటున్నాము. యెహోవా మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించును గాక!

మీ సహోదరులు,

యెహోవాసాక్షుల పరిపాలక సభ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి