కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/08 పేజీ 2
  • సేవా కూటాల కార్యక్రమం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల కార్యక్రమం
  • మన రాజ్య పరిచర్య—2008
  • ఉపశీర్షికలు
  • సెప్టెంబరు 8తో ప్రారంభమయ్యే వారం
  • సెప్టెంబరు 15తో ప్రారంభమయ్యే వారం
  • సెప్టెంబరు 22తో ప్రారంభమయ్యే వారం
  • సెప్టెంబరు 29తో ప్రారంభమయ్యే వారం
  • పాట 6 (45)
  • పాట 22 (130)
మన రాజ్య పరిచర్య—2008
km 9/08 పేజీ 2

సేవా కూటాల కార్యక్రమం

సెప్టెంబరు 8తో ప్రారంభమయ్యే వారం

పాట 25 (204)

10 నిమి: స్థానిక ప్రకటనలు. జూలై-సెప్టెంబరు కావలికోటలో ఏ ఆర్టికల్‌లు స్థానిక ప్రజలకు ఆసక్తికరంగా ఉన్నాయో ప్రేక్షకులను చెప్పమనండి. ఆ ఆర్టికల్‌లను పరిచయం చేయడానికి ఏ ప్రశ్నలను, లేఖనాలను ఉపయోగించారో చెప్పమని అడగండి. ఆసక్తి ఉన్నట్లు గ్రహించిన తర్వాత పత్రికను ఎలా అందించవచ్చో ప్రదర్శింపజేయండి.

15 నిమి: బైబిలు విద్యార్థులు బోధకులయ్యేందుకు సహాయం చేయండి. కావలికోట జనవరి 15, 2007, 29-30 పేజీలు, 14-20 పేరాల ఆధారంగా ప్రసంగం. ప్రచారకుడు బహిరంగ ప్రసంగం గురించి, కావలికోట అధ్యయనం గురించి క్రొత్త బైబిలు విద్యార్థికి వివరించి, ఆ కూటాలకు హాజరవమని కోరుతున్నట్లు చూపించే క్లుప్త ప్రదర్శనను చేర్చండి.

20 నిమి: మన పరిచర్యలో ఎదురయ్యే దురభిమానాన్ని అధిగమించడం. దురభిమానం మన పరిచర్యను ఎలా ప్రభావితం చేయగలదనే విషయంపై మన ప్రచురణల్లో ఉన్న సమాచారం ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం. అలాంటి దురభిమానాన్ని ఎలా అధిగమించవచ్చో వివరించండి. కొన్నిసార్లు క్షేత్రంలో మనం ఉపయోగించే పదాలు, పరిచర్యలోనూ దైనందిన జీవితంలోనూ మన ప్రవర్తన దురభిమానాన్ని అధిగమించడానికి తోడ్పడి, సత్యం తెలుసుకునేలా ప్రజల మనసులను తెరవవచ్చు. కాబట్టి మన మాటలను, ప్రవర్తనను అన్ని సమయాల్లో జాగ్రత్తగా గమనించుకోవడం ప్రాముఖ్యం. (1 పేతు. 2:12; 3:1, 2) దురభిమానాన్ని ఎలా అధిగమించవచ్చో చూపించే స్థానిక లేదా ప్రచురిత అనుభవాలను కొన్నింటిని ఎంపికచేసుకొని చెప్పండి.

పాట 15 (127)

సెప్టెంబరు 15తో ప్రారంభమయ్యే వారం

పాట 5 (46)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.

20 నిమి: గత సంవత్సరంలో మనమెలా చేశాం? సేవా పైవిచారణకర్త లేదా అర్హుడైన మరో పెద్ద ఇచ్చే ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. గత సేవా సంవత్సరంలో, పరిచర్యలో సంఘం చేసిన కార్యకలాపాలను పునఃసమీక్షిస్తూ, సాధించిన మంచి విషయాలపై దృష్టి నిలపండి. సముచితమైన విధంగా మెచ్చుకోండి. ఒకరు లేదా ఇద్దరు ప్రచారకులు తమకు కలిగిన విశేషమైన అనుభవాలను చెప్పేలా ముందుగానే ఏర్పాటుచేసుకోండి. రాబోయే సంవత్సరంలో సంఘం దృష్టి నిలపాల్సిన ఒకటి, రెండు అంశాలను వివరించండి. మెరుగుపర్చుకునేందుకు ఆచరణాత్మకమైన సలహాలను పరిశీలించండి.

15 నిమి: సృష్టిని గురించిన నా నమ్మకాన్ని నేనెలా సమర్థించగలను? ప్రచురిత సమాచారం ఆధారంగా ప్రసంగం. సృష్టిలో తమకున్న నమ్మకాన్ని పాఠశాలలో, పని స్థలంలో లేదా మరెక్కడైనా ఎలా సమర్థించుకున్నారో చెప్పమని ప్రేక్షకులను కోరండి. ఒకటి, రెండు వ్యాఖ్యానాలను ముందుగానే ఏర్పాటు చేసుకోవచ్చు.

పాట 7 (51)

సెప్టెంబరు 22తో ప్రారంభమయ్యే వారం

పాట 8 (53)

10 నిమి: స్థానిక ప్రకటనలు. సంఘ ఖర్చుల వివరాలను, సంఘం పంపించిన విరాళాలు అందినట్లు తెలియజేస్తూ సంస్థ పంపిన ఉత్తరాన్ని చదవండి. 1వ పేజీలోవున్న బ్రాంచి ఉత్తరాన్ని చర్చించండి.

20 నిమి: మీ క్రియలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కావలికోట ఏప్రిల్‌ 15, 2005, 28వ పేజీ 6వ పేరా నుండి 29వ పేజీ చివరి వరకు ఉన్న సమాచారం ఆధారంగా ప్రసంగం. తమ వస్తుసంబంధ లేక భావోద్రేక అవసరాలను యెహోవా ఎలా తీర్చాడో వివరించమని ఒకరు లేదా ఇద్దరు ఉత్సాహవంతులైన ప్రచారకులను క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి.

15 నిమి: అక్టోబరు-డిసెంబరు కావలికోట అందించడానికి సిద్ధపడండి. ఆ పత్రిక గురించి క్లుప్తంగా వివరించి, స్థానిక క్షేత్రానికి ఏ ఆర్టికల్‌లు ఆకర్షణీయంగా ఉండవచ్చో చెప్పమని ప్రేక్షకులను అడగండి. ఆ ఆర్టికల్‌లను పరిచయం చేయడానికి ఏ ప్రశ్నలను, ఏ లేఖనాలను ఉపయోగించవచ్చు? మన సందేశాన్ని వినడానికి గృహస్థుడు నిజంగా ఇష్టపడుతున్నాడని మనమెలా గ్రహించవచ్చు? మన రాజ్య పరిచర్యలోని మాదిరి అందింపును ఎలా ఉపయోగించవచ్చో ప్రదర్శింపజేయండి. స్థానిక క్షేత్రానికి తగినవిధంగా ఉండే ఆర్టికల్‌ ఆధారంగా సిద్ధం చేసుకున్న సంక్షిప్త అందింపును పెద్దలలో ఒకరితో ప్రదర్శింపజేయండి.

పాట 20 (93)

సెప్టెంబరు 29తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

10 నిమి: స్థానిక ప్రకటనలు. సెప్టెంబరు క్షేత్రసేవా రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తుచేయండి. సమావేశాల సంబంధంగా, సెలవుల్లో, వేసవి నెలల్లో మరితర సందర్భాల్లో అనియత సాక్ష్యమిస్తున్నప్పుడు ఎదురైన ప్రోత్సాహకర అనుభవాలను ఒకరిద్దరు ప్రచారకులు చెప్పే విధంగా ముందుగానే ఏర్పాటు చేసుకోండి.

15 నిమి: స్థానిక అవసరాలు.

20 నిమి: “నవంబరు 10 నుండి డిసెంబరు 7 వరకు కరపత్రాన్ని అందించే ప్రత్యేక ప్రచార కార్యక్రమం!”a కరపత్రాలు అందుబాటులో ఉంటే ప్రేక్షకుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రతిని ఇవ్వండి. 2వ పేరా పరిశీలిస్తున్నప్పుడు కరపత్రంలోని అంశాలను క్లుప్తంగా సమీక్షించండి. 4వ పేరా పరిశీలిస్తున్నప్పుడు కరపత్రాన్ని అందించడంలో ప్రచారకుడు నేర్పును, వివేచనను ఎలా ఉపయోగిస్తాడో ప్రదర్శింపజేయండి. 6వ పేరా పరిశీలిస్తున్నప్పుడు ఒక ప్రచారకుడు పునర్దర్శనం చేసేటప్పుడు బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించడానికి కరపత్రాన్ని ఉపయోగించడాన్ని ప్రదర్శింపజేయండి.

పాట 22 (130)

అక్టోబరు 6తో ప్రారంభమయ్యే వారం

పాట 2 (15)

10 నిమి: స్థానిక ప్రకటనలు.

15 నిమి: ప్రశ్నాభాగం. ప్రేక్షకులతో చర్చ. కావలికోట జూన్‌ 15, 2005, 20-22 పేజీలు, 10-16 పేరాల్లో నుండి వ్యాఖ్యానాలను చేర్చండి.

20 నిమి: “యెహోవాను ప్రేమించడం ఇతరులకు నేర్పించండి.”b సమయం అనుమతిస్తే ఉల్లేఖించబడిన లేఖనాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

పాట 21 (191)

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి