కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/08 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2008
మన రాజ్య పరిచర్య—2008
km 9/08 పేజీ 3

ప్రకటనలు

▪ సాహిత్య ప్రతిపాదనలు సెప్టెంబరులో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం. మొదటి సందర్శనంలోనే బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేకంగా కృషి చేయండి. గృహస్థుల దగ్గర ఈ ప్రచురణ అప్పటికే ఉన్నట్లయితే, బైబిలు అధ్యయనాన్ని క్లుప్తంగా ప్రదర్శించడం ద్వారా వారు ఆ పుస్తకం నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చో చూపించండి. అక్టోబరులో: కావలికోట పత్రిక. ఆసక్తి చూపించినచోట, బైబిలు అధ్యయనాలను ప్రారంభించాలనే ఉద్దేశంతో మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని అందించి దానిని చర్చించండి. నవంబరులో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం. బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేకంగా కృషి చేయండి. డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకం అందజేయండి. అది లేకపోతే నా బైబిలు కథల పుస్తకం అందజేయవచ్చు.

▪ నవంబరులో ఐదు వారాంతాలున్నాయి కాబట్టి, సహాయ పయినీరు సేవ చేయడానికి అది అనువైన నెల.

▪ 2009వ సంవత్సరపు జ్ఞాపకార్థ ఆచరణ కాలం కోసమైన ప్రత్యేక బహిరంగ ప్రసంగం 2009, ఏప్రిల్‌ 20వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఇవ్వబడుతుంది. ప్రసంగాంశం తర్వాత తెలియజేయబడుతుంది. ఆ వారాంతంలో ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనగానీ సమావేశంగానీ ఉండే సంఘాలకు ఆ తర్వాతి వారంలో ప్రత్యేక ప్రసంగం ఇవ్వబడుతుంది. ఏ సంఘంలోనూ ఏప్రిల్‌ 20వ తేదీతో ప్రారంభమయ్యే వారంకన్నా ముందు ప్రత్యేక ప్రసంగం ఇవ్వకూడదు.

▪ సంఘాలు వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ 2008, సీడీ-రామ్‌లో ఉన్న వాచ్‌టవర్‌ లైబ్రరీ—2008 ఎడిషన్‌ కోసం తమ రిక్వెస్టులను తర్వాతి సాహిత్యపు రిక్వెస్ట్‌తోపాటు పంపించడం ప్రారంభించాలి. ఈ వాచ్‌టవర్‌ లైబ్రరీ—2008 ఎడిషన్‌ సంఘంలో కేవలం సంఘ సభ్యులకు మాత్రమే సంఘం ద్వారానే లభ్యమౌతుందని దయచేసి గమనించండి.

▪ సంఘ పైవిచారణకర్త లేదా ఆయన నియమించిన మరొకరు జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సంఘ అకౌంట్స్‌ను ఆడిట్‌చేయాలి. తర్వాతి నెలల అకౌంట్స్‌ను ఆడిట్‌ చేయడానికి అదే సహోదరుణ్ణి నియమించకూడదు. ఆడిటింగ్‌ పూర్తయ్యాక సంఘంలో తర్వాతి అకౌంట్స్‌ రిపోర్టుతోపాటు దాన్ని చదవాలి.—ఇన్‌స్ట్రక్షన్‌ ఫర్‌ కాంగ్రిగేషన్‌ అకౌంటింగ్‌ (S-27)ను చూడండి.

▪ లభ్యమయ్యే కొత్త ప్రచురణ:

నా బైబిలు కథల పుస్తకం (పెద్ద సైజు) —పంజాబీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి