పత్రికల గురించి ఏమి చెప్పాలి?
కావలికోట ఏప్రి.–జూన్
“మనం ప్రతీరోజు బాధలు, వ్యాధులు, మరణం గురించి వింటూనే ఉంటాం. ఇవి లేని కాలం ఎప్పటికైనా వస్తుందని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] లక్షలాదిమందికి నిరీక్షణనిచ్చిన ఒక లేఖనం చూడాలనుకుంటున్నారా? [అనుకూలంగా ప్రతిస్పందిస్తే యోహాను 3:16 చదివి, 23వ పేజీ చూపించండి.] ‘యేసు మరణించడం మిమ్మల్ని ఎలా రక్షించగలదు?’ అనేది ఈ ఆర్టికల్ అంశం.”
కావలికోట జూలై–సెప్టెం.
“దేన్నైనా చూస్తేనే తప్ప నమ్మమని అనేకమంది ప్రజలు అంటారు. మీరేమంటారు? [ప్రతిస్పందించనివ్వండి.] పరిశుద్ధ లేఖనాల్లోనుండి ఒక వచనాన్ని చూపించమంటారా? [గృహస్థుడు అనుకూలంగా ప్రతిస్పందిస్తే రోమీయులు 1:20 చదవండి.] ఈ పత్రిక, సృష్టిలో స్పష్టంగా కనబడే దేవుని మూడు లక్షణాలను తెలియజేస్తూ ఈ లక్షణాలను తెలుసుకోవడం మనల్నెలా ప్రభావితం చేయగలదో చర్చిస్తుంది. మీకు ఆసక్తివుంటే ఈ పత్రిక తీసుకోండి.”