పత్రికల గురించి ఏమి చెప్పాలి?
కావలికోట ఏప్రిల్-జూన్
“దేవుడు అన్ని ప్రార్థనలు వింటాడా? దీని గురించి మీరేమి అనుకుంటున్నారు? [వాళ్ళేమి చెప్తారో వినండి.] మనస్ఫూర్తిగా ప్రార్థించడానికి సహాయం చేసే ఒక మంచి సలహాను నేను మీకు చూపించవచ్చా? [వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారని అనిపిస్తే, మత్తయి 6:7 వ వచనం చదవండి.] ప్రార్థన గురించి చాలామంది అడిగే నాలుగు ప్రశ్నలకు బైబిలు ఏమి జవాబిస్తుందో ఆసక్తికరమైన ఈ ఆర్టికల్ వివరిస్తుంది.” 16వ పేజీలో ఉన్న ఆర్టికల్‌ను చూపించండి.
కావలికోట జూలై-సెప్టెంబరు
“ప్రతీ ఒక్కరూ పరిశుభ్రమైన పరిసరాల్లో జీవించాలని కోరుకుంటారు. దేవుడు కూడా తన ఆరాధకులు పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాడనే విషయం మీకు తెలుసా? [వాళ్లేమి చెప్తారో వినండి.] దాని గురించి ఆయనేమి చెప్పాడో మీకు చూపించమంటారా? [వాళ్లు ఒప్పుకుంటే, 1 పేతురు 1:16 చదవండి. ఆ తర్వాత 9వ పేజీలో ఉన్న ఆర్టికల్ చూపించండి.] పరిశుభ్రంగా ఉండాలంటే మనం ఏమి చేయాలో ఈ ఆర్టికల్ వివరిస్తుంది.”