పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోట సెప్టెం. 15
“ఇక్కడున్న మాటలపై మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. [ద్వితీయోపదేశకాండము 32:4 చదవండి.] దేవుడు సర్వశక్తిమంతుడు, న్యాయవంతుడైతే లోకంలో ఇన్ని బాధలు, దుష్టత్వం ఎందుకున్నాయని మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] దేవుడు దుష్టత్వాన్ని నేటి వరకూ ఎందుకు అనుమతించాడో ఈ పత్రిక వివరిస్తోంది.”
తేజరిల్లు! జూలై-సెప్టెం.
“ఎన్నో వివాహాలు విచ్ఛినమౌతున్నాయి కాబట్టి, వ్యక్తులు తమ వివాహ భాగస్వాములను జ్ఞానయుక్తంగా ఎంపిక చేసుకోవడం ప్రాముఖ్యం. సరైన నిర్ణయం తీసుకోవడానికి మనకేది సహాయపడుతుంది? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ ప్రాచీన సామెత అనేకమందికి సహాయం చేసింది. [సామెతలు 22:3 చదివి, 16వ పేజీలో ఉన్న ఆర్టికల్‌ను చూపించండి.] వ్యక్తులు సరైన నిర్ణయం తీసుకొనేందుకు సహాయపడే ఆలోచింపజేసే సమాచారం ఈ ఆర్టికల్‌లో ఉంది.”
కావలికోట అక్టో. 1
“‘నేనలా చేయకుంటే బాగుండేది’ అని మీకెప్పుడైనా అనిపించిందా? [ప్రతిస్పందించనివ్వండి.] మనమందరం కొన్నిసార్లు తీసుకున్న నిర్ణయాలబట్టి తర్వాత ఎందుకు బాధపడతాం అన్న విషయం గురించి ఇక్కడ ఏమి చెబుతుందో చూడండి. [యిర్మీయా 10:23 చదవండి.] మంచి నిర్ణయాలు తీసుకోవడానికి బైబిల్లో ఉన్న ఆచరణాత్మక సలహా ఎలా మనకు సహాయపడుతుందో ఈ పత్రిక వివరిస్తోంది.”
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“తల్లిదండ్రులు తమకు నిజంగా సహాయపడే సలహా ఎక్కడ కనుగొనగలరని మీరనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] బైబిల్లో చేయబడిన ఈ వాగ్దానాన్ని గమనించండి. [2 తిమోతి 3:16 చదవండి.] సంతోషకరమైన పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రులకు సహాయపడడానికి బైబిలు ఎంత ఆచరణాత్మకమైనదో ఈ పత్రిక చూపిస్తోంది.”