పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోటసెప్టెం. 15
“నేడు అందరూ ఆందోళనపడుతున్న ఒక వార్తా విషయం ప్రస్తావించండి. ఆ తర్వాత ఇలా అడగండి: “మనం జీవించే కాలాన్ని ఈ బైబిలు వచనం సరిగ్గా వర్ణిస్తుందని మీరనుకుంటున్నారా? [2 తిమోతి 3:1 చదివి, ప్రతిస్పందించనివ్వండి.] ఈ ఆర్టికల్ మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామనే రుజువును పరిశీలిస్తూ మనమేమి చేయాలో వివరిస్తోంది.”
తేజరిల్లు! జూలై-సెప్టెం.
“నేటి లోకంలో నెగ్గాలంటే కోపం ప్రదర్శించాలని కొంతమంది నమ్ముతారు. దీనికి భిన్నంగా, యేసు ఏమి సిఫారసు చేశాడో గమనించండి. [మత్తయి 5:5, 9 చదవండి.] మీరు ఈ విషయాన్ని ఒప్పుకుంటారా? [ప్రతిస్పందించనివ్వండి.] సమాధానంగా ఉండడంవల్ల వచ్చే మూడు ప్రయోజనాలను ఈ పత్రిక నొక్కిచెబుతుంది.” 28వ పేజీలోని ఆర్టికల్‌ను చూపించండి.”
కావలికోటఅక్టో. 1
“జీవశాస్త్రజ్ఞులు వ్యాధిని నిర్మూలించి, ఆయుష్షును పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికైనా నిరంతరం జీవించడం సాధ్యమవుతుందని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] మనం నిరంతరం జీవించాలనే స్వప్నం వెనకున్న కారణమేమిటో గమనించండి. [ప్రసంగి 3:11 చదవండి.] నిరంతరం జీవించాలనే కోరికతో దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడో ఈ పత్రిక వివరిస్తుంది.”
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“చాలామంది దేవుణ్ణి నమ్మడం విజ్ఞానశాస్త్రపరంగా సరైనదేనా అని ఆలోచిస్తుంటారు. మీరేమంటారు? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత హెబ్రీయులు 3:4 చదవండి.] కొంతమంది విజ్ఞానశాస్త్రజ్ఞులు సృష్టికర్తను నమ్మేందుకు నడిపించిన సాక్ష్యాధారాలను ఈ తేజరిల్లు ప్రత్యేక సంచిక చర్చిస్తుంది.”