కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/07 పేజీ 3
  • “ఏది అత్యుత్తమ వైద్యచికిత్స?”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ఏది అత్యుత్తమ వైద్యచికిత్స?”
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు ఏవి ఎంపిక చేసుకునే అవకాశముందో మీకు తెలుసా?
    మన రాజ్య పరిచర్య—2011
  • మీరు ఏవి ఎంపిక చేసుకునే అవకాశముందో మీకు తెలుసా?
    మన రాజ్య పరిచర్య—2009
  • రక్త రహిత చికిత్స —వైద్య శాస్త్రం ఆ సవాలును ఎదుర్కొంటుంది వీడియోను మీరు తప్పకుండా చూడండి
    మన రాజ్య పరిచర్య—2002
  • రక్త రహిత చికిత్స—వైద్య శాస్త్రం ఆ సవాలును ఎదుర్కొంటుంది అనే వీడియోనుండి ప్రయోజనం పొందండి
    మన రాజ్య పరిచర్య—2004
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2007
km 1/07 పేజీ 3

“ఏది అత్యుత్తమ వైద్యచికిత్స?”

“రక్తరహిత వైద్యచికిత్సను అందుకున్న ప్రతీ రోగి నిజానికి అత్యుత్తమ శస్త్రచికిత్సను అందుకున్నాడు” అని మెడికల్‌ డైరెక్టర్‌, అనస్థీషియాలజిస్ట్‌ డాక్టర్‌ మైఖెల్‌ రోజ్‌ చెప్పాడు. “రక్తరహిత చికిత్స”లో ఎలాంటి చికిత్సావిధానాలు, రక్తమార్పిడి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి? వైద్యచికిత్స, లేదా శస్త్రచికిత్సల విషయంలో జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం మీరు వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రక్త రహిత చికిత్స​—⁠వైద్య శాస్త్రం ఆ సవాలును ఎదుర్కొంటుంది అనే వీడియోను చూడండి. ఆ తర్వాత, ఈ క్రింది ప్రశ్నల సహాయంతో మీ అవగాహనను పరీక్షించుకోండి. గమనిక: ఆ వీడియోలో శస్త్రచికిత్సకు సంబంధించిన క్లుప్త దృశ్యాలున్నాయి కాబట్టి, తల్లిదండ్రులు చిన్న పిల్లలతో కలిసి ఆ వీడియో చూసే విషయంలో వివేచనను ఉపయోగించాలి.

(1) యెహోవాసాక్షులు రక్తమార్పిడులను నిరాకరించడానికి ముఖ్య కారణమేమిటి? (2) వైద్యచికిత్స విషయంలో యెహోవాసాక్షులు ఏమి కోరుకుంటారు? (3) రోగులకు ఏ ప్రాథమిక హక్కువుంది? (4) మార్పిడి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఎందుకు సముచితమైనది, బాధ్యాతాయుతమైనది? (5) రక్తం ఎక్కువగా నష్టపోతునప్పుడు, వైద్యులు ముఖ్యంగా ఏ రెండు అత్యవసర చర్యలు తీసుకోవాలి? (6) మార్పిడి ప్రత్యామ్నాయ చికిత్సా విధానంలోవున్న నాలుగు సూత్రాలు ఏమిటి? (7) వైద్యులు ఎలా (ఎ) రక్తం నష్టపోవడాన్ని తగ్గించవచ్చు, (బి) ఎర్రరక్త కణాలను పొదుపు చేయవచ్చు, (సి) రక్తోత్పత్తిని పెంచవచ్చు, (డి) కోల్పోయిన రక్త పరిమాణాన్ని తిరిగి పెంచవచ్చు? (8) ఈ క్రింది వైద్యవిధానాలను వివరించండి: (ఎ) హిమోడైల్యూషన్‌ (బి) సెల్‌ సాల్వేజ్‌. (9) ఏ విధమైన రక్తమార్పిడి ప్రత్యామ్నాయం గురించైనా మీకెలాంటి సమాచారం ఇవ్వబడాలని మీరు కోరుకుంటారు? (10) రక్తమార్పిడి లేకుండా సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసే అవకాశముందా? (11) వైద్య రంగంలోనే ఎలాంటి క్రొత్త అభివృద్ధి జరుగుతోంది?

వీడియోలో చూపించబడిన కొన్ని చికిత్సా విధానాలను అంగీకరించడం, ప్రతీ వ్యక్తి బైబిలు శిక్షిత మనస్సాక్షి ప్రకారం వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయం. మీరు, మీ పిల్లలు మార్పిడి ప్రత్యామ్నాయాల్లో వేటిని అంగీకరించాలని అనుకుంటున్నారో నిర్ణయించుకున్నారా? సాక్షులుకాని మీ కుటుంబ సభ్యులకు కూడా మీ నిర్ణయాల గురించి, వాటి కారణాల గురించి పూర్తిగా తెలియజేయాలి.​—కావలికోట జూన్‌ 15, 2004, అక్టోబరు 15, 2000 సంచికల్లోని “పాఠకుల ప్రశ్నలు” చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి