కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/07 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2007
మన రాజ్య పరిచర్య—2007
km 1/07 పేజీ 3

ప్రకటనలు

▪ సాహిత్య ప్రతిపాదనలు జనవరిలో: 192 పేజీల ఏ పాత పుస్తకమైనా లేక 1991వ సంవత్సరానికి ముందు ప్రచురించబడిన ఏ పుస్తకాన్నైనా ప్రతిపాదించవచ్చు. సంఘాల్లో అలాంటి పాత పుస్తకాలు అందుబాటులో లేకపోతే, జ్ఞానము పుస్తకాన్ని గానీ, అప్రమత్తంగా ఉండండి! అనే బ్రోషుర్‌ను గానీ ప్రతిపాదించండి. ఫిబ్రవరిలో: యెహోవాకు సన్నిహితమవండి పుస్తకాన్ని అందించాలి. ఈ పుస్తకం స్టాకులోలేని సంఘాలు, ప్రకటన ముగింపు! పుస్తకాన్ని లేక స్టాకులో అధికంగా ఉన్న వేరే పాత పుస్తకాన్ని ఉపయోగించవచ్చు. మార్చిలో: బోధిస్తోంది పుస్తకాన్ని ప్రతిపాదించి బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేక కృషి చేయండి. బోధిస్తోంది పుస్తకంతోపాటు మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని ప్రతిపాదించండి. ఏప్రిల్‌, మేలో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలు అందించండి. ఆసక్తిగలవారిని పునర్దర్శించేటప్పుడు, జ్ఞాపకార్థ ఆచరణకు లేదా సంఘంలోని ఇతర ప్రత్యేక సంఘటనలకు హాజరవుతూ సంఘంతో మాత్రం క్రియాశీలంగా సహవసించని వారిని సందర్శిస్తున్నప్పుడు, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ప్రతిపాదించడం మీద దృష్టి నిలపండి. వారితో గృహ బైబిలు అధ్యయనం ఆరంభించే లక్ష్యంతో ఆ పుస్తకాన్ని ప్రతిపాదించండి.

▪ ఫిబ్రవరి నుండి మార్చి 4లోపు ప్రాంతీయ పైవిచారణకర్తలు ఇచ్చే కొత్త బహిరంగ ప్రసంగాంశం “దేవుని నూతనలోకం​—⁠దానిలోకి ప్రవేశించడానికి ఎవరు అర్హులవుతారు?”

▪ యువత ఇలా అడుగుతోంది​—నేను నా జీవితంలో ఏమి చేస్తాను? (ఆంగ్లం) అనే వీడియో భాగం ఏప్రిల్‌లో నిర్వహించబడే సేవాకూటంలో చర్చించబడుతుంది. అవసరమైతే, వీలైనంత త్వరగా ఆ వీడియో కాపీల కోసం సంఘం ద్వారా రిక్వెస్టు చేసుకోవాలి.

▪ చైనీసులో మన సాహిత్యాలు రెండు విధాలైన లిపులలో ప్రచురించబడింది. తైవాన్‌, హాంకాంగ్‌లోని ప్రజలు సాధారణంగా మనం “చైనీస్‌” (CH) భాషగా పిలిచే సాంప్రదాయక లిపిని చదువుతారు. చైనీయుల్లో అనేకమంది ఇతర పాఠకులు సాధారణంగా “సరళీకృత చైనీసు” (CHS)గా పరిగణించే సరళమైన లిపినే చదువుతారు. ఒక వ్యక్తి చదివే లిపి, ఆయన మాట్లాడే కంటోనీస్‌, మాండరిన్‌ లేదా ఇతర భాషకు సంబంధం లేకపోయినా, అతను ఎన్నుకునే లిపిని నిర్ధారించుకోవడం ప్రాముఖ్యం. ఈ విధంగా, సరైన లిపిలో ఉన్న సాహిత్యం కొరకు రిక్వెస్టు చేయాలి.

▪ ఈ సంవత్సరం ఏప్రిల్‌ 2, సోమవారం సూర్యాస్తమయం తర్వాత జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకునేందుకు సంఘాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రసంగం ముందుగానే ప్రారంభమైనప్పటికీ చిహ్నాలను మాత్రం సూర్యాస్తమయం అయ్యేంత వరకు అందించకూడదు. మీ ప్రాంతంలో సూర్యాస్తమయం ఎప్పుడవుతుందో స్థానికంగా అడిగి తెలుసుకోండి. ప్రతీ సంఘం సొంతగా జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకునేందుకు ప్రయత్నించాలి. అయితే ఇది అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. సాధారణంగా ఒకే రాజ్యమందిరాన్ని అనేక సంఘాలు ఉపయోగించుకుంటున్న ప్రాంతాల్లో ఒకటి లేక అంతకంటే ఎక్కువ సంఘాలు ఆ సాయంత్రానికి మరో స్థలాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకే హాలును ఒక సంఘం తర్వాత మరో సంఘం ఉపయోగించాలనుకుంటే, ఆ ఆచరణ నుండి అందరూ పూర్తి ప్రయోజనం పొందేందుకు కార్యక్రమాల మధ్య వీలైతే కనీసం 40 నిమిషాల వ్యవధి ఉండాలని మేము సూచిస్తున్నాం. హాజరయ్యే వారిని తీసుకురావడం, తీసుకువెళ్ళడంతోపాటు ట్రాఫిక్‌, పార్కింగ్‌ వంటి వాటి గురించి కూడా ఆలోచించాలి. స్థానికంగా ఎలాంటి ఏర్పాట్లు శ్రేష్ఠమైనవో పెద్దల సభ నిర్ణయించాలి.

▪ సంఘ కార్యదర్శులు, సంఘంలోని ప్రతీ క్రమ పయినీరుకు సంబంధించిన పయినీర్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ (S-202) తమ దగ్గర ఉండేలా చూసుకోవాలి. ఆ ఉత్తరం తమ దగ్గర లేనట్లయితే, వ్రాతపూర్వకంగా బ్రాంచి కార్యాలయానికి తెలియజేయాలి.

▪ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

యెహోవాకు స్తుతిగీతాలు పాడండి (29 పాటలు)​—బెంగాలీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి